ఇద్దరిని తీసుకెళ్ళిపోతాను సార్…బాలయ్యకే ధమ్కీ ఇచ్చిన ప్రభాస్..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో భారీ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఎవరు ఊహించని రీతిలో దూసుకుపోతుంది. ఇక న్యూ ఇయర్ కానుకగా వ‌చ్చిన‌ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఎపిసోడ్ భారీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా విభజించిన ఆహా తోలి ఎపిసోడ్‌లో బాలకృష్ణ- ప్రభాస్‌తో చేసిన అల్లరి సరదా ముచ్చట్లు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Unstoppable with NBK Season 2: Nandamuri Balakrishna asks Prabhas about marriage, link-ups | Entertainment News,The Indian Express

ప్రభాస్ మ్యారేజ్, ఎఫైర్‌స్ గురించి ఎప్పుడూ నోరు విప్పని డార్లింగ్-బాలయ్యతో తన మనసులోని మాటను చెప్పేసాడు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రభాస్ సెకండ్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. అందులో ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా ఉన్నాడు. ఆ ప్రోమోలో బాలయ్య తన పంచ్‌లతో ఈ ఇద్దరి హీరోల‌ని ఓ రీతిలో ఆడుకున్నాడు. వారి నుంచి ఎప్పుడు రాని ఆసక్తికర విషయాల‌న్ని కూడా చెప్పించాడు.

Nandamuri Balakrishna Sweet Conversation WIth Prabhas in Unstoppable With NBK Season 2

ఈ క్రమంలోనే ప్రభాస్- గోపీచంద్ 2008లో ఓ క్రేజీ హీరోయిన్ కోసం గొడవ పడ్డారట.. ఇదే విషయాన్ని బాలయ్య వాళ్ళిద్దరిని అడగగా.. ఈ విషయంపై ప్రభాస్ స్పందిస్తూ.. చెప్పరా నేనైతే పడలేదు ఏదైనా ఉంటే చెప్పు అంటూ గోపీచంద్ ను ఆడుకున్నాడు. ఆ తర్వాత బాలకృష్ణ మాళవికా మోహన్, శృతిహాసన్ ఈ ఇద్దరి ముద్దుగుమ్మలలో నువ్వు ఎవరితో ఫోన్ మార్చుకుంటావు అంటూ గోపీచంద్‌ను అడగగా.. నాకు పెళ్లయిపోయింది.. అప్పుడు ప్రభాస్ పెళ్లి కాకముందు అంటూ అనటంతో షోలో అందరికీ నవ్వులు తెప్పిస్తుంది.

Prabhas in Unstoppable Show: ప్రభాస్ షర్ట్ ధర... ఒక సామాన్యుడు ఏడాది పాటు షాపింగ్ చేయవచ్చు!

బాలకృష్ణ అ తర్వాత నయనతార, తమన్నాలలో ఎవరిని షాపింగ్ తీసుకెళ్తారని ఇద్దరినీ అడగగా.. ప్రభాస్ మాత్రం ఇద్దరితో వెళ్తానని అంటాడు. ఇక జిల్ సినిమాలో గోపిచంద్ లుక్ మాములుగా ఉండదని.. అదిరిపోయిందని బాల‌య్య అన్నారు . మీరిద్దరు ఇలాగే నవ్వుకుంటూ ఉంటారా.. అసలు ఏం మాట్లాడుకుంటారు ? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు బాలయ్య. ఈ సెకండ్ ఎపిసోడ్ జనవరి 6న ఆహ‌లో స్ట్రీమింగ్ అవ్వ‌నుంది.