చిరంజీవిని 24 సార్లు చెంప దెబ్బ కొట్టిన సీనియర్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా..!

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఆయనతో ఎందరో అగ్ర హీరోయిన్లు నటించి మెప్పించారు. అయితే వారిలో రాధిక- చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకు మాత్రం ఎంతో సూపర్ క్రేజ్ ఉండేది. రాధిక కూడా తెలుగులో తన కెరీర్ ను ముందుగా చిరంజీవి హీరోగా వచ్చిన ‘న్యాయం కావాలి’ అనే సినిమాతో తన కెరీర్‌ను మొదలుపెట్టింది. అప్పటినుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతూనే ఉంది.

Chiranjeevi: క్రేజీ న్యూస్.. చిరంజీవితో సినిమా ప్రకటించిన సీనియర్ హీరోయిన్,  బ్లాక్ బస్టర్ లోడింగ్

ఈ క్రమంలోనే రాధిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా చిరంజీవికి తన మధ్య ఉన్న బాండింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. రాధిక- చిరంజీవితో న్యాయం కావాలి అనే సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్‌ సమయం నుంచే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఈ సినిమా తర్వాత కూడా వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కూడా వచ్చాయి. ఆ సినిమాల్లో వీరిద్దరి కెమిస్ట్రీ కూడా ఎంతో అద్భుతంగా ఉంది.. వీటితోపాటు వీరిద్దరిపై ఎన్నో రూమర్లు కూడా వచ్చాయి కానీ అటువంటి ఎన్ని వార్తలు వచ్చిన వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని అవి విడదీయలేకపోయాయని చెప్పవచ్చు.

అయితే ఇదే క్రమంలో న్యాయం కావాలి సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి- రాధిక మధ్య ఓ ఆసక్తికర సంఘటన జరిగిందట. ఒకరోజు షూటింగ్‌లో భాగంగా చిరంజీవిని రాధిక చెంప దెబ్బ కొట్టే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.. ”ఆ సన్నివేశానికి ఏకంగా చిరంజీవి 24 టేక్స్ తీసుకున్నారట.. ఆ 24 సార్లు రాధిక చిరంజీవిని చెంప‌ మీద కొట్టిందట”. ”దాంతో చిరంజీవి చెంప బాగా కందిపోయి, చెంప ఎర్రగా ఉబ్బిపోయింది. దాంతో రాధిక‌ వెళ్లి ఆయనకు సారీ చెప్పడానికి వెళ్ళినప్పుడు చిరు పరవాలేదు అమ్మా… నా చెంపను బాగానే వాయించవమ్మా అంటూ నవ్వారు” అని తాజా గా జ‌రిగిన ఇంటర్వ్యూలో రాధాక సంఘటనను మరోసారి గుర్తుచేసుకుంది.