బాల‌య్య సినిమా కోసం చిరు – నాగార్జున… ఆ స్టార్ క్రికెట‌ర్ కూడా ఎంట్రీ…!

నట‌సింహ నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో… టాలీవుడ్ అగ్ర నిర్మాత అశ్వినీద‌త్ ఓ భారీ సినిమాను మొదలుపెట్టారు. ఇక ఈ సినిమాకు ప్రముఖ రచయిత సత్యానంద్ కథ, మాటలో ఇవ్వగా, ప్రముఖ నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ స్క్రీన్ ప్లే అందించగా.. మాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందించారు, వేటూరి పాటలు, ప్రభుదేవా డాన్స్, వంటి అగ్ర ప్రముఖులు ఈ సినిమాకు పని చేయగా.. శోభన్ బాబు, మీనా, అమ్రిష్ పూరి, నగ్మా వంటి అగ్ర నటీమణులు ఈ సినిమాలో నటించారు.

Aswamedham (1992) | V CINEMA - Movie, Review, Cast, Songs & Release Date

ఇక ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోలో ఓ పాటతో షూటింగ్ మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఆ టైంలో టీమిండియా పాపులర్ క్రికెటర్, బాలయ్య స్నేహితుడు అజారుద్దీన్, మెగాస్టార్ చిరంజీవి, యువసామ్రాట్ నాగార్జున కూడా వచ్చారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ నిజాం కాలేజీలో చదువుతున్న రోజుల్లో బాలకృష్ణ, ఆజారుద్దీన్ క్లాస్మేట్స్.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కూడా వీరికి క్లాస్మేట్స్.

తాజాగా అన్ స్టాపబుల్ ఎపిసోడ్‌లో బాలయ్యతో సందడి చేశారు. అతిరథుల సమక్షంలో అత్యంత గ్రాండ్ గా ప్రారంభమైన సినిమానే ‘అశ్వమేథం’.. ఈ సినిమాలో నటభూషణ శోభన్ బాబు కూడా ఓ కీలక పాత్రలో నటించారు. అలాగే బాలకృష్ణతో మొదటిసారిగా అందాల భామలు మీనా, నగ్మా జత కట్టారు. ఇక ఈ సినిమాలో అభిమన్యు అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శోభన్ బాబు నటించారు. ఇక అలాగే కిరీటి అనే పైలెట్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య కనిపించారు.

డాక్టర్ గా మీనా, జర్నలిస్టుగా నగ్మా నటించారు. మాస్ట్రో ఇళయరాజా అందించిన పాటలన్నీ ఆ రోజులు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు రాఘవేంద్రరావు బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టు తెరకెక్కించారు. ఈ సినిమా 1992 డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా భారీ స్థాయిలో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన తొలిరోజే ఓపెనింగ్స్ కూడా భారీ స్థాయిలో వచ్చాయి.

Aswamedham Telugu Full length Movie || Bala Krishna , Shobhan Babu , Meena  , Nagma - YouTube

కానీ ఈ సినిమా అనుకొన్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే ఈ సినిమాలో నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరుకి మాత్రం మంచి పేరు వచ్చింది. ఇదే, అజహరుద్దీన్, చిరంజీవి, నాగార్జున ముఖ్య అతిథులుగా విచ్చేసిన బాలయ్య బాబు ‘అశ్వమేథం’ ఓపెనింగ్ తాలూకు విశేషాలు..