కాజ‌ల్ ఎంట్రీతో చేతి దాకా వ‌చ్చి చేజారిన బిగ్ ఆఫ‌ర్‌.. త్రిష ఆవేద‌న‌!?

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన హీరోయిన్ల జాబితాలో త్రిష ఒకరు. అయితే మధ్యలో ఈమె కెరీర్ బాగా డౌన్ అయింది. అలాంటి తరుణంలో మణిరత్నం రూపొందించిన `పొన్నియన్ సెల్వన్` మూవీతో త్రిష కు పూర్వవైభవం వచ్చింది. ఇందులో కుందువై పాత్రలో అద్భుతమైన న‌ట‌న‌ను కనిబ‌రిచి విమర్శకులు నుంచి ప్రశంసలు అందుకుంది.

ఈ మూవీ తర్వాత త్రిషకు మళ్ళీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే విజ‌య్ ద‌ళ‌పతికి జోడిగా ఓ సినిమాకు సైన్ చేసింద‌ని అంటున్నారు. రీసెంట్గా అజిత్ కుమార్ సినిమాలోనూ న‌టించే అవ‌కాశం రాబోయింద‌ట‌. నయనతార భర్త, కోలీవుడ్ దర్శక నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌, అజిత్ కుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడ‌క్ష‌న్‌ బ్యానర్ పై ఈ మూవీ నిర్మితం కానుంది. ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లబోతోంది.

అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను ఎంపిక చేయాలని భావించారట. ఆమెను సంప్రదించాలని కూడా అనుకున్నారట. కానీ ఇంతలోనే మనసు మార్చుకుని త్రిషకు బదులుగా కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారట. గతంలో వివేకం సినిమాలో అజిత్ కాజల్ కెమిస్ట్రీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే కాజల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారట. మొత్తానికి కాజల్ ఎంట్రీ తో త్రిషకు చేతి దాకా వ‌చ్చి ఓ బిగ్ ఆఫ‌ర్‌ చేజారింది. దీంతో ఆమె ఎంతో ఆవేదన చెందుతుందని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.

Share post:

Latest