మహేష్- త్రివిక్రమ్ సినిమా నుంచి పూజాను ఎందుకు తీసేశారు.. అస‌లేం జ‌రిగింది..!

మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29వ‌ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అవుతుంది. అయితే మహేష్ బాబు ఇంటిలో వరుస విషాదాలు కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఈ సమయంలోనే ఈ సినిమా స్టోరీ కూడా పూర్తిగా మారిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన వెంటనే తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడు మహేష్ బాబు- త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా స్టోరీ మొత్తం మారిపోవడంతో. ఇప్పుడు సినిమా కూడా మళ్లీ ఫ్రెష్ గా మొదలు పెట్టాల్సి వస్తుంది.

ఈ సమయంలోనే ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో మహేష్‌కు జంటగా పూజా హెగ్డేను తీసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో ఆమె జాయిన్ అవ్వనున్నారు అని కూడా బజ్‌ కూడా మొదటిలో వచ్చింది. ఇప్పుడు ఆమెను ఈ సినిమా నుంచి అనుకోని కారణాలవల్ల తొలగించారనేది లేటెస్ట్ టాలీవుడ్ సర్కిల్స్ సమాచారం. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎంత వైర‌ల్‌గా మారింది.

SSMB28: మహేష్ బాబు లేకుండానే సినిమా షూరు చేసిన త్రివిక్రమ్.. స్పెషల్  అట్రాక్షన్‏గా నమ్రత.. | Superstar mahesh babu and trivikram srinivas movie ssmb  28 started today | TV9 Telugu

త్రివిక్ర‌మ్ ఈ సినిమా అంటేనే ఇద్ద‌రు హీరోయిన్లు ఉంటారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఇద్ద‌రు భామ‌లు ఉన్న‌రు. పూజా ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. మరో అందాల భామ శ్రీలీల‌ కూడా ఈ సినిమాలో నటిస్తుంది. ఇప్పుడు.. పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు వస్తున్న వార్తల్లో భాగంగా ఇప్పుడు మహేష్ కు జంటగా మరో బాలీవుడ్ కొత్త హీరోయిన్ తీసుకురానున్నారని తెలుస్తుంది.

Pooja Hegde Agrees to be Part of SSMB28

పూజ త్రివిక్ర‌మ్ అడిగిన‌ట్టుగా కంటిన్యూగా కాల్షీట్లు ఇవ్వ‌లేన‌ని చెప్పింద‌ట‌. అందుకు త్రివిక్ర‌మ్ ఒప్పుకోలేదంటున్నారు. అందుకే ఆమెను త‌ప్పించార‌ని టాక్ ? అయితే ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాల్సింది.