అన్‌స్టాపబుల్‌కి భారీ షాక్ ఇవ్వబోతున్న నెట్‌ఫ్లిక్స్‌.. మాస్టర్ ప్లాన్ అదే..?

ఓటీటీకి డిమాండ్ పెరుగుతున్న వేల ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలుగులో ఆహా పేరుతో ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి తెచ్చాడు. కొత్త తెలుగు సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో పాటు తెలుగు డబ్బింగ్ సినిమాలు, టాక్ షో లతో ఆహా ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో పోయిన ఏడాది ప్రారంభమైన అన్‌స్టాపబుల్ షో బాగా సక్సెస్ అయ్యింది. బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న ఈ టాక్ షో కి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది.

ఈ షో చూసేందుకు ఆహా ప్లాట్‌ఫామ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను చాలామంది తీసుకుంటున్నారు. సబ్‌టైటిల్స్ కూడా ఉండడంతో ఇతర భాష వారు కూడా దీనికి సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నారు. కాగా స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ కూడా ఇలాంటి ఒక టాక్ షో తీసుకొచ్చి తన సబ్‌స్క్రైబర్‌ల సంఖ్యాపించుకోవాలని యోచిస్తోంది. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే, బాలకృష్ణను తన టాక్ షో కోసం నెట్‌ఫ్లిక్స్‌ తీసుకోవాలని అనుకుంటుందంట. అదే జరిగితే బాలకృష్ణ ఆహా నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆహా కు పెద్ద దెబ్బ పడే ప్రమాదం ఉంది.

నిజానికి ఆహా కంటే నెట్‌ఫ్లిక్స్‌కు ఎక్కువమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అందువల్ల, సెలబ్రిటీల టాక్ షో అక్కడ ప్రసారం చేస్తే ఇంకా హిట్ అవుతుంది. కాగా నెట్‌ఫ్లిక్స్‌ టాక్ షో గురించి వార్తలు వస్తున్నాయి కానీ అధికారికంగా ఇంతవరకైతే ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ఒకవేళ ఇది ప్లాన్ చేసినా బాలకృష్ణ ఆహ్వాని వదిలి వెళ్ళిపోతాడా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్‌.