టాలీవుడ్ లో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోల్లో రవితేజ కూడా ఒకరు. గడిచిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ లతో సతమతమవుతున్న సమయంలో ఇటీవలే ధమాకా చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. డైరెక్టర్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల కూడా అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఈ సినిమా విడుదల ఇప్పటికే వారం రోజులు కావస్తున్న భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాలలో కూడా మంచి విజయాన్ని అందుకుంది.
ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్, టీజర్ వంటివి విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది .ఈ క్రమంలోనే తాజాగా రవితేజ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ నోటిని షేర్ చేసుకోవడం జరిగింది. ధమాకా విజయం తనకు ఒక మర్చిపోలేని సినిమా అందించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ఆనందం కలిగిందని తెలియజేశారు. ఈ సినిమా సక్సెస్ ను గత ఏడాది మనం కోల్పోయిన దిగ్గజాలకు అంకితం చేస్తున్నానంటూ తెలియజేశారు. ముఖ్యంగా ఈ ఏడాది చాలా కష్టంగా గడిచిందని తెలిపారు.
కానీ మీ షరతులు లేని ప్రేమ నన్ను ముందుకు సాగించేలా చేసింది.ఈ రోజు మంచి రేపు సంవత్సరం కూడా బాగుంటుంది అంటూ బాగా ద్వేగంతో ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ టాక్ దూసుకుపోతోంది ఇక ఈ సినిమా కలెక్షన్లలో ఇప్పటివరకు రూ.70 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టు కాస్త వైరల్ గా మారుతోంది.
#HappyNewYear2023 🤗 pic.twitter.com/Xuxw28TCty
— Ravi Teja (@RaviTeja_offl) January 1, 2023