ఫైనల్లీ .. ఆషూ రెడ్డి లవర్ ఎవరో తెలిసిపోయిందోచ్.. పాప అడ్డంగా బుక్కైందిగా..!!

బిగ్ బాస్ బ్యూటీ ఆషూ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే . జూనియర్ సమంతగా గుర్తింపు సంపాదించుకుని పాపులారిటీ దక్కించుకున్న ఆషూ.. ఆ తర్వాత బిగ్బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యి తనదైన స్టైల్ లో గేమ్ ఆడుతూ హోస్ట్ నాగార్జున ని కూడా మెల్ట్ చేసి టెంప్ట్ చేసి ఆట ఆడేసుకున్నింది. అంత ఎందుకు ఆషూ బిగ్ బాస్ సీజన్ లో ఎలిమినేట్ అయి హౌస్ నుండి బయటకు వస్తుండగా నాగార్జునను ముద్దు పెట్టుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది .

కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆషూ రెడ్డి ..రాహుల్ తో ఓ రేంజ్ లో మింగిల్ అయింది . అంతేనా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ జాన్ జిగిడి దోస్తులు అన్నట్లు చేతులు పట్టుకొని తిరగడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . వీళ్ళకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి . ఓసారి డిన్నర్ చేస్తూ… మరోసారి మీద పడుకొని ..మరోసారి ఏకంగా రాహుల్ సిప్లిగంజ్ ఆషూ ని ఎత్తుకోవడం .. ఇవన్నీ చూసిన జనాలు రాహుల్ – ఆషూ మధ్య ప్రేమ బంధం కొనసాగుతుందని అనుకుంటున్నారు .

కాగా రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే . ఈ పాట పాడింది రాహుల్ నే. ఈ క్రమంలోనే ప్రపంచ వేదికపై ఆయన పేరు వినిపించడం రాహుల్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది . దీంతో రాహుల్ ఫ్యాన్స్ ఆయనకు కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు . ఈ క్రమంలోని ఆషూ సైతం రాహుల్ సిప్లిగంజ్ ను హగ్ చేసుకుని మరి ఫోటోకి ఫోజులు ఇచ్చి విష్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో రాహుల్ – ఆషూ లవ్ లో ఉన్నారు అంటూ మరోసారి కన్ఫర్మ్ అయిందని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. చూడాలి మరి దీనిపై ఆషూ ఏ విధంగా స్పందిస్తుందో..?

 

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)