ఈ ఫారెన్ పిల్ల అందుకు పనికి రాదా..? ఏకిపారేస్తున్న జనాలు..ఏమైందంటే..?

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్.ఆర్. ఆర్..2022 మార్చ్ 24 న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బలాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇద్దరు స్టార్ హీరోలను కలిపి మల్టీ స్టార్లర్గా తరకెక్కించడమే. మనకు తెలిసిందే స్టార్ హీరోస్ కన్నా స్టార్ హీరో ఫ్యాన్స్ తోనే తలనొప్పులు ఎక్కువ . ఇద్దరు ఫ్యాన్స్ లో ఏ హీరో ఫ్యాన్స్ నైనా సరే తక్కువ చేసి చూపించిన డైలాగ్స్ తక్కువ రాసిన సోషల్ మీడియాలో ఏకీపారేస్తారు జనాలు.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో మాత్రం అన్ని కూల్ గా సెట్ అయ్యేలా చేసుకున్నాడు ఎస్ఎస్ రాజమౌళి . ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి సినిమా తీయ్యాలనే నిర్ణయానికి రావడమే పెద్ద సాహసం. అయితే ఇద్దరు స్టార్ హీరో ఫ్యాన్స్ ని మెప్పించడం మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. అయితే అలాంటి సాహసాలను అవలీలగా మెప్పించగలిగాడు రాజమౌళి . కాగా రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ చిత్రం కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది.

ఈ క్రమంలోనే పలువురు స్టార్స్ కీరవాణి కి బెస్ట్ విషెస్ అందిస్తున్నారు . అయితే ఈ సినిమాలో ఈ పాటలో భాగమైన హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ మాత్రం కీరవాణి అవార్డు అందుకున్న దానిపై ఇప్పటివరకు ఏమి స్పందించలేదు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు . అలియా భట్ , అజయ్ దేవగన్ లాంటి వాళ్ళు కూడా విష్ చేస్తూ పోస్ట్ పెట్టారు .

కానీ ఈ పాటలో కాలు కదిపిన ఒలీవియా మోరిస్ మాత్రం ఎటువంటి విధంగా స్పందించకపోవడంతో జనాలు ట్రోల్ చేస్తున్నారు. అసలు రాజమౌళి నిన్ను ఈ పాత్రకి తీసుకుని ఉండాల్సింది కాదని.. ఈ సినిమాలో ఈ రోల్ కు నువ్వు అన్ఫిట్ అని.. నువ్వు అసలు పనికిరావంటూ కొందరు ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఒలీవియా మోరిస్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!