అయ్యయ్యో..ఆ ఒక్క మెసేజ్ తో..అలియా పరువు మొత్తం పోయిందే..!!

ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసిన ఆర్ఆఆర్ర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్ – ఎన్టీఆర్ కలిసి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా నటించిన ఈ ప్రతిష్టాత్మకమైన సినిమాని దర్శకధీరుడు రాజమౌళి.. కొన్ని రాత్రులు పగలు నిద్ర లేకుండా శ్రమించి తెరకెక్కించారు . కాగా ఆయన కష్టానికి ఫలితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయింది . కాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో మెరిసిన హాలీవుడ్టీ బ్యూటీ ఒలివియా మోరీస్.. అలాగే బాలీవుడ్ డ్యూటీ అలియా భట్ సినిమా రిలీజ్ తర్వాత ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురయ్యారో మనకు తెలిసిందే.

సినిమాలో హీరోయిన్ పాత్ర కన్నా హీరోల పాత్ర పైనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసిన రాజమౌళి మరీ ముఖ్యంగా అలియా భట్ విషయంలో తీవ్ర అన్యాయం చేశారంటూ అప్పట్లో బాలీవుడ్ మీడియా కూడా ఫైర్ అయ్యింది. కాగా సినిమాకి ఒరిజినల్ సాంగ్ విభాగంలో గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా స్టార్స్ అందరూ కీరవాణిని మెచ్చుకుంటూ సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు . అయితే కొందరు బాలీవుడ్ మీడియా సంస్థలు గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఆర్ఆర్ఆర్ సినిమాకు వస్తే అది అలియాభట్ కే దక్కింది అన్నంత హంగామా చేస్తున్నారు.

అలియా పోస్టర్ ని హైలైట్ చేస్తూ ఆర్ఆర్ఆర్ పేరును మరింతగా వాడుకుంటున్నారు . ఈ క్రమంలోనే కొందరు తెలుగు ఫ్యాన్స్ మండిపడుతున్నారు . ఆర్ఆర్ఆర్ సినిమా అలియా కి వచ్చిన్నట్లైతే కచ్చితంగా రిలయన్స్ కూడా అనిల్ అంబానీదే అంటూ జోకులు వేస్తున్నారు. అంతేనా ఈ సినిమాలో అలియా భట్ పాత్ర కంటే పులులుకే ఎక్కువ స్క్రీన్ టైమ్ దక్కిందని మరో నెటిజన్ కామెంట్ చేయడం అలియా భట్ పరువు తీసిన్నట్లైంది.