పబ్లిక్‌గా ఆల్కహాల్ తాగుతూ రచ్చ చేస్తున్న యాక్ట్రెస్ ప్రగతి.. ఫోటో వైరల్!

ప్రముఖ నటి ప్రగతి గురించి స్పెషల్‌గా పరిచయం అవసరం లేదు. ఈ హాట్ భామ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో హీరోయిన్‌గా కొన్ని సినిమాలలో నటించింది. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ప్రగతి తల్లి పాత్రలో ఎక్కువగా నటిస్తోంది. అయితే ప్రగతి ఈమధ్య సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

ఒకవైపు సోషల్ మీడియాలో, ఇంకోవైపు బుల్లితెరపై కనిపిస్తూ హంగామా చేస్తుంది. బుల్లితెరపై సందడి చేస్తూనే సోషల్ మీడియాలో కూడా తన జీవితానికి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు కొన్ని జీవిత పాఠాలను నేర్పిస్తుంది ప్రగతి. తాజాగా ప్రగతి షేర్ చేసిన ఒక్క పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ ఫొటోలో ప్రగతి చేతిలో మందు గ్లాస్ పట్టుకొని ఎంజాయ్ చేస్తుంది.

చేతిలో గ్లాస్ పట్టుకొని ఉన్న ఫోటో ని షేర్ చేస్తూ.. జీవితంలో ఎప్పుడు మానకి కావాల్సిన దాని కోసం పోరాడుతూ ఉండాలి. ఆశతో జీవిస్తూ ఉంటే అన్ని జరుగుతాయి, కానీ ప్రయత్నం మాత్రం కచ్చితంగా ఉండాలి అని చెప్పుకొచ్చింది. ఇలా ప్రగతి చేతిలో గ్లాస్ పట్టుకొని దిగిన ఫోటోలను షేర్ చేస్తూ జీవితం గురించి ఆమె చెప్పిన నీతి సూక్తులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ప్రగతి ఒంగోలులోని ఉలవపాడు లో జన్మించిన అచ్చు తెలుగు వ్యక్తి. ఈ నటి మైసూర్ సిల్క్ ప్యాలెస్‌కి మోడల్‌గా మారి తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత భాగ్యరాజ్‌ డైరెక్ట్ చేసిన వీట్ల విశేషంగా సినిమా ద్వారా కథానాయికగా పరిచయం అయింది. ఆ సమయంలో, ఆమె ఏడు తమిళ చిత్రాలు, ఒక మలయాళ చిత్రంలో నటించింది. ఆపై ఆమె వివాహం చేసుకుని గ్యాప్ తీసుకుంద. మూడు సంవత్సరాల తర్వాత టెలివిజన్ సీరియల్స్‌లో నటిస్తూ యాక్టింగ్ రంగానికి మళ్లీ దగ్గరయింది.