టాలీవుడ్ ఇండస్ట్రీని చిన్నచూపు చూస్తున్న దుల్కర్ సల్మాన్..??

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మహానటి, సీతారామం సినిమాలతో తెలుగులో మంచి హిట్స్ సాధించాడు. మహానటిలో సైడ్ రోల్ చేసినా అతడికి మంచి క్రేజ్ వచ్చింది. ఇక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ తో వచ్చిన సీతారామం అతన్ని తెలుగులో స్టార్ హీరోగా నిలబెట్టింది. అలానే దుల్కర్ నటించిన మలయాళ సినిమాలు ఎన్నో తెలుగులో డబ్ అయి తెలుగు ప్రేక్షకులను అలరించాయి. అతను హీరోగా చేసిన కనులు కనులు దోచాయంటే సినిమా ఎంతగానో అలరించింది. అలా తెలుగు ఇండస్ట్రీలో ఈ హీరోకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయింది.

ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా దుల్కర్ తెలుగు సినీ అవకాశాలు వాటిని రిజెక్ట్ చేస్తున్నాడట. టాలీవుడ్ ఫ్యాన్స్ దుల్కర్ నుంచి ఒక స్ట్రైట్ తెలుగు సినిమా వస్తే చూసి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు కానీ ఇతను మాత్రం తెలుగు ప్రేక్షకులను చాలా లైట్ గా తీసుకుంటున్నాడని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బాలీవుడ్‌లో కూడా దుల్కర్ సల్మాన్‌కి మంచి క్రేజ్ ఉంది. కానీ హిందీ ప్రేక్షకులను కూడా ఈ హ్యాండ్సమ్ హీరో లైట్ తీసుకుంటున్నాడు.

ఇప్పుడు కేవలం మలయాళం సినిమాలపైనే తన దృష్టి అంతా కేంద్రీకరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో మలయాళ గ్యాంగ్‌స్టర్ మూవీ ‘కింగ్ ఆఫ్ కోతా’లో నటిస్తున్నాడు. సాధారణంగా ఏదైనా భాషలో మంచి హిట్ కొడితే మళ్లీ అదే భాషలో ఒక సినిమా తీయడం హీరోలకు అలవాటు కానీ దుల్కర్ మాత్రం వెంటనే తన మలయాళ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోతుంటాడు. ఈ హీరో ఒక మలయాళ సినిమాలో నటిస్తుండటంతో పాటు గన్స్ & గులాబ్స్‌ అనే ఒక హిందీ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ నెట్‌ఫ్లిక్స్‌ హిందీ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో రిలీజ్ కానుంది.