ఇలియానా లాంటి తన నాజుకైన నడుముని చూపించి కైపెక్కిస్తున్న అరియనా..!

బిగ్‌బాస్ 4లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసి పాపులర్ అయిన ముద్దుగుమ్మ అరియానా గ్లోరీ. ఈ పాపకు ఇన్‌స్టాగ్రామ్‌లో తొమ్మిది లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. బిగ్‌బాస్ సమయంలో తన స్మార్ట్ ప్లేతో చాలామంది అభిమానాన్ని సంపాదించుకుందీ తార. ఆ సీజన్‌లో ఫైనలిస్టుగా కూడా నిలిచింది. ఆ షో ద్వారా పాపులారిటీ పెంచుకున్న ఈ అమ్మడు ఎంటర్‌టైనమెంట్ ఛానళ్లలో చాలా అవకాశాలను పొందుతోంది. సెలబ్రిటీ ఇంటర్వూలు కూడా చేస్తూ తన కెరీర్‌ని ముందుకు తీసుకెళ్తోంది.

అలానే పర్ఫెక్ట్ ఫిగర్ మైంటైన్ చేస్తూ తన అందాలను సోషల్ మీడియా వేదికగా ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది. ఈ నాజుకైన ముద్దుగుమ్మ తన నడుమందాలు, హాట్ పోజుల్లో చేస్తున్న వర్కవుట్‌ వీడియోలు షేర్ చేస్తూ కైపెక్కిస్తోంది. రాంగోపాల్‌వర్మ అరియానాని అప్పట్లో నీ తొడలు బాగున్నాయని కామెంట్ చేశాడు. అప్పటినుంచి ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ లో పాల్గొనే ఛాన్స్ పట్టేసింది. బోల్డ్ పాపగా బుల్లితెరకు పరిచయమైన ఈ బ్యూటీ తన ఆటిట్యూడ్ తో చాలామందికి నచ్చేసింది.

ఆ తర్వాత కూడా డైరెక్టర్ రాంగోపాల్‌వర్మతో చేసిన ఓ అడల్ట్ టైప్ ఇంటర్వూ అరియానా గ్లోరీని మరింత పాపులర్ చేసేసింది. కాగా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బీబీ జోడీ అనే ఒక స్టార్ మా డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో తన నడుమ అందాలన్నీ ఆరబోస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా తన బొడ్డు అందాలను చూపించే ఫోటోలను కూడా పంచుకుంది. ఈ హాట్ అవతారంలో ఈ తార బీబీ జోడిలో కనిపించింది. ఈ ఫోటోలలో అరియనా సన్నని నడుము చూసి ఆమెను ఇలియానాతో పోల్చుతున్నారు నెటిజన్లు.