ఆ విషయంపై మోక్షజ్ఞ తన నిర్ణయం మార్చుకున్నాడ.. కొత్త ప్లాన్ ఇదేనా..!?

నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఈ మధ్యకాలంలో తరచూ బయట కనిపిస్తున్నాడు. గతంలో ఎప్పుడూ మోక్షజ్ఞ పెద్దగా బయట కనిపించేవాడు కాదు. వాళ్ళ అక్క పెళ్లిలోనూ మోక్షజ్ఞ కనిపిస్తాడేమో అని అభిమానులు ఆశగా ఎదురు చూశారు.. కానీ అది జరగలేదు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

Nandamuri Mokshagna Star Hero MLA Nandamuri Balakrishna's Son Mokshagna  Latest Viral Photos | Nandamuri Mokshagna: అబ్బాయ్ మోక్షజ్ఞతో బాలయ్య -  వైరల్ అవుతోన్న లేటెస్ట్ ఫోటోలు

ఆ ఫోటోలో మోక్షజ్ఞ చాలా సింపుల్ గానే కనిపిస్తున్నాడు. హీరోగా సక్సెస్ అవ్వాలంటే సిక్స్ ప్యాక్ బాడీ లేకపోయినా నటనలో మెళకువలు ఉండాలి కానీ మోక్షజ్ఞ అలాంటివి ఏమి పట్టించుకోవడం లేదు అన్నట్లుగా కనిపిస్తున్నాడు. ఆయన ఫోటోలు చూస్తుంటే హీరో అవ్వాలనే పట్టుదల లేనట్టుగానే కనిపిస్తుంది. గత కొద్దిరోజులుగా మోక్షజ్ఞ అభిమానులతో ఎక్కువగా కనిపిస్తున్నాడు.

తన తండ్రి బాలయ్య పుట్టినరోజు కోసం టర్కీ వెళ్లాడు.. ఇక రీసెంట్ గా నాని ప్రొడ్యూస్ చేసిన హిట్2 సినిమాను తన తండ్రితో కలిసి వీక్షించాడు. ఇక ఇప్పుడు సంక్రాంతి కానుకగా బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా సూపర్ హిట్ గా నిలిచి భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సినిమాను జీవీకే మాల్ లో తన స్నేహితుల‌తో కలిసి వీక్షించాడు.

ఇప్పుడు సంక్రాంతి పండగను పురస్కరించుకుని నారా- నందమూరి కుటుంబాలు నారావారిపల్లెకు వెళ్లారు. అక్కడ బాలయ్యతో లోకేష్- మోక్షజ్ఞ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. లోకేష్ కూడా బావమరిదిని కాసేపు ఆట పట్టించాడు కూడా గతంలో ఎప్పుడు బయట కనిపించని మోక్షజ్ఞ.. ఇప్పుడు బయట తరచూ కనిపించడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి ఫీల్ అవుతున్నారు. త్వరలోనే మోక్షజ్ఞ సినిమాలోకి అరంగేట్రం చేయాలని నందమూరి అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.