రాసి పెట్టుకోండి..2023 వ సంవత్సరం మొత్తం మాదే.. చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

ఈ 2023 వ సంవత్సరం మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చింది. ఈ సంవత్సరం ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి సినిమా వాల్తేరు వీరయ్య ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరగటంతో పాటు అదే స్థాయిలో కలెక్షన్లు కూడా వచ్చాయి. ఈ సినిమా సూపర్ సక్సెస్ తో చిరంజీవి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. దీంతోపాటు మరోవైపు చరణ్- ఉపాసన దంపతులు కూడా రీసెంట్ గానే తీపి కబురు చెప్పిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఈ శుభవార్త గురించి చిరంజీవి స్పందిస్తూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఆయన మాట్లాడుతూ ‘చరణ్- ఉపాసనలకు జులై లేదా ఆగస్టులో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారని చెప్పుకొచ్చాడు’. ఇక చిరంజీవి పుట్టినరోజు కూడా ఆగస్టు 22వ తేదీ కావడంతో అదే నెలలో చరణ్- ఉపాసన దంపతులకు బిడ్డ జన్మిస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో మరికొందరు కామెంట్లుు చేస్తున్నారు. ఉపాసన ఇచ్చిన తీపి కబురు వల్ల మా కుటుంబం మొత్తం ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి పేర్కొన్నాడు.

 Ram Charan Became A Father On That Month Details, Ram Charan, Upasana, Tollywood-TeluguStop.com

ఇదే ఇంటర్వ్యూలో చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా మాట్లాడుతూ మాకు మేనల్లుడు పుడితే బాగుంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేసింది. మరోవైపు మెగా హీరోలకు 2023 సంవత్సరం బాగా కలిసి రావాలని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సంవత్సరం మెగా కుటుంబం నుంచి వచ్చిన సినిమాలన్నీ భారీ విజయం అందుకోవాలని మెగా అభిమానులు ఆశపడుతున్నారు. చరణ్- శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కూడా ఈ సంవత్సరమే థియేటర్లో రిలీజ్ కానుండగా.. చిరంజీవి మెహర్ రమేష్ కాంబోలో వస్తున్న బోళా శంకర్ సినిమా కూడా ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రానుంది.

వీటితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా కూడా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. మెగా ఫ్యామిలీ మిగిలిన యువ హీరోలు సైతం వరుస ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు.2023 వ సంవత్సరం మెగా సంవత్సరం గా మారుతుందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.