నాగ చైతన్య కస్టడీ నుంచి కృతి శెట్టి ఇంటెన్స్ లుక్ రిలీజ్.. పోస్టర్ తోనే అదరగొట్టిందిగా..!

అక్కినేని ఫ్యామిలీ నుంచి రెండో తరం నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చి వరుస విజయాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను సొంతం చేసుకున్న యువ హీరో నాగచైతన్య. మజిలీ, లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి మెంబర్బుల్ సినిమాలతో ప్రేక్షకులకు గుర్తుండిపోయే రీతిలో నటించాడు. మధ్యలో థాంక్యూ వంటి డిజాస్టర్ తో డీలా పడిపోయాడు.

అలాగే అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చడ్డా సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టాడు. ఇక ఈ విధంగా 2022 సంవత్సరంలో వరుసగా రెండు ప్లాప్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో నాగచైతన్య తన తర్వాత సినిమాలపై ఆచితూచి అడుగులు వేస్తూ జాగ్రత్తగా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తో ఓ సినిమా స్టార్ట్ చేశాడు. వైవిధ్యమైన సినిమాల దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ కోలీవుడ్ డైరెక్టర్ కు చైతు అవకాశం ఇచ్చాడు.

CUSTODY New Exclusive Movie | Naga chaitanya | Krithi Shetty | Venkat | Latest South Hindi Movies Hd - YouTube

NC22 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. రీసెంట్ గానే ఈ సినిమాకు కస్టడీ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో కూడిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌లో చైతు పోలీస్ గెటప్ లో ఇంటెన్స్ లుక్ తో అదరగొట్టాడు. ఈ సినిమాలో మరోసారి నాగచైతన్యతో కృతి శెట్టి నటిస్తుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి కృతి శెట్టి ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఎప్పుడు గ్లామర్ పాత్రల్లో మెరిసే ఈ కన్నడ బ్యూటీ ఇప్పుడు మాత్రం విభిన్న పాత్రలో నటించబోతున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూస్తే అర్థమవుతుంది.

 Krithi Shetty First Look In Custody, Naga Chaitanya, Director Venkat Prabhu, Kri-TeluguStop.com

ఈ పోస్టర్ రెగ్యులర్ గా కాకుండా ఆసక్తికరంగా ఉందీ. కృతిశెట్టి ఎమోషనల్ యాక్టింగ్ ని ఎలివేట్ చేసేదిగా కనిపిస్తోంది.ఇక ఈమె రోల్ సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి.‘కస్టడీ’ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు. ఈ చిత్రం మే 12న రిలీజ్ కాబోతుంది.