చీరకట్టులో కనిపించి హృదయాలను దోచేస్తున్న మాళవిక మోహన్..!

మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ మాస్టర్ సినిమాలో విజయ్‌తో జతకట్టి స్టార్ హీరోయిన్‌గా అవతరించింది. ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ తలరాతే మారిపోయింది. ఈ హీరోయిన్ 2022లో ధనుష్ హీరోగా వచ్చిన తమిళ్ యాక్షన్ థ్రిల్లర్ మారన్ లో కూడా మెరిసింది. ఇప్పుడు తంగలన్ అనే తమిళ మూవీ, యుధ్రా అనే హిందీ మూవీలలో నటిస్తోందీ అమ్మడు. ఈమె ప్రభాస్ & మారుతి కాంబో సినిమాలో కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తోంది. మాళవిక ఈ మూవీలో సైక్రియాటిస్ట్ రోల్‌లో యాక్ట్ చేస్తున్నట్లు టాక్. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తన ఫొటోషూట్స్ పంచుకుంటూ అభిమానులకు టచ్ లో ఉంటుందీ ముద్దుగుమ్మ.

తాజాగా ఈ తార చీరలో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. వాటిలో ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా కనిపించింది దాంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. మోడ్రన్ డ్రెస్‌ల్లో హాట్ గా కనిపించే మీరు శారీలో సూపర్ క్యూట్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు అంటూ కితాభిస్తున్నారు. మాళవిక కళ్ళతోనే మ్యాజిక్ చేస్తుందని అందరినీ కట్టిపడేస్తుందని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. శారీ లుక్‌లో మీకంటే ఎక్కువ అందంగా ఎవరూ ఉండరు మేడం అని ఇంకొందరు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇకపోతే మలయాళీ మూవీ ‘పెట్టం పోలె’తో 2013లో హీరోయిన్‌గా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన మాళవిక.. ఆపై పేట సినిమాలో ఒక మెయిన్ రోల్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. కొద్ది రోజుల క్రితం ఈ తార రవితేజ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది. కానీ ఆ అవకాశాన్ని కావాలనే వదులుకుంది. ఈ యంగ్ బ్యూటీ తెలుగులోకి ఎంట్రీ ఇస్తే ఆ సినిమాని హిట్ చేయాలని చాలామంది అభిమానులు వెయిట్ కూడా చేస్తున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఎప్పుడు అడుగుపెడుతుందో చూడాలి.