బాగా తెగించిన శ్రీముఖి.. అందరి ముందే డాక్టర్ బాబును గట్టిగా హత్తుకుని..!!

తెలుగు బుల్లితెరపై నాటీ & ఎనర్జిటిక్ యాంకర్‌గా తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకుంది శ్రీముఖి. అదుర్స్, సూపర్ సింగర్ 9 టీవీ షోలకు హోస్ట్‌గా మారి తన కెరీర్ ప్రారంభించిన శ్రీముఖి ఆ తర్వాత జులాయి సినిమా ద్వారా వెండితెరకి పరిచయమైంది. అనంతరం యాంకర్ రవితో కలిసి పటాస్ వంటి షోలు చేసి బాగా పాపులర్ అయింది. బిగ్‌బాస్-3లో పాటిస్పేట్ చేసి రన్నరప్‌గా నిలిచి ఇంకా బాగా ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకుంది. ఈ ముద్దుగుమ్మ తన వాక్చాతుర్యంతో, అల్లరి చేష్టలతో ప్రతి టీవీ షోనూ ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా మార్చగలదు. అందుకే ఆమెకు టీవీలో ఎప్పుడూ అవకాశాలు లభిస్తూనే ఉంటాయి.

ప్రస్తుతం ఈ అందాల తార డ్యాన్స్ ఐకాన్, ఆదివారం విత్ స్టార్ మా పరివారం, మిస్టర్ అండ్ మిస్సెస్, సారంగ దరియా షోలకు యాంకరింగ్ చేస్తుంది. కాగా తాను హోస్ట్ చేస్తున్న ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’కి నెక్స్ట్ ఎపిసోడ్‌కి కార్తీకదీపం సీరియల్‌ ఫేమ్ డాక్టర్ బాబు, వంటలక్క విచ్చేశారు. వీరి ఎపిసోడ్ ఈ ఆదివారం ప్రసారం కానుంది. దానికంటే ముందు ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక ప్రోమోను స్టార్ మా అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఒక వీడియో షేర్ చేసింది. కార్తీకదీపం యాక్టర్స్‌కి ఫేర్వెల్ పార్టీగా ఈ ఎపిసోడ్ ఉంటుందని, ఇది ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుందని ఆ హ్యాండిల్ రాసింది.

 

 

View this post on Instagram

 

A post shared by STAR MAA (@starmaa)

ఈ వీడియోలో షో వేదిక మీదకి డాక్టర్ బాబు, వంటలక్క రావడం కనిపించింది. వంటలక్క వస్తూ వస్తూ.. “నేను లేనిది చూసి లైన్ వేస్తున్నావంటా??” అని డాక్టర్ బాబుని ఉద్దేశిస్తూ అంటుంది. వెంటనే శ్రీముఖి కలుగజేసుకొని.. “నన్నయితే ఇలా హగ్ కూడా చేసుకున్నాడు” అని డాక్టర్ బాబును హగ్ చేసుకుంటుంది. అప్పుడు డాక్టర్ బాబు ఇదే సందనుకుంటూ అలా కాదు ఇలా హగ్ చేసుకున్న అంటూ గట్టిగా ఆమెను హగ్ చేసుకున్నాడు. ఈ ప్రోమో చూసిన వారంతా శ్రీముఖి ఇలా చేయడాన్ని విమర్శిస్తున్నారు. ఇలా హగ్ చేసుకుని తెగించాలా అని ఇంకొందరు ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. శ్రీముఖి గతంలో కూడా ఇలాంటి నాటి పనులు చేసి హాట్ టాపిక్ అయింది.