Bigg Boss 6 ఫైనల్ కోసం మాస్టర్ ప్లాన్… గెస్ట్ గా ఆ స్టార్ హీరో వస్తాడో రాడో?

బిగ్ బాస్ సీజన్ 6 ఓ వర్గం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచిందని తాజా సర్వేలే చెబుతున్నాయి. ఈసారి అంచనాలకు తగ్గట్టుగా కంటెస్టెంట్స్ హౌస్ లో లేకపోవడం వలన మొదట్లో TRP రేటింగ్స్ బాగా పడిపోయాయి. దాంతో చేసేదేమీ లేక షో నిర్వాహకులు ఈసారి సీజన్ ను తొందరగా ముగిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఫైనల్ ఎపిసోడ్ కు మాత్రం రికార్డ్ స్థాయిలో రేటింగ్ అందుకోవాలి అని బిగ్ బాస్ నిర్వాహకులు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం.

బిగ్ బాస్ గత సీజన్స్ ఒకసారి గమనించినట్లయితే అవసరమైతే ఎలిమినేషన్స్ వాయిదా వేసి మరీ ఒక వారానికి పొడిగించి ఎక్కువగా క్యాష్ చేసుకొనేందుకు ప్రయత్నాలు చేసేవారు. కానీ ఈసారి ఈ షోలోకి ఎక్కువ మందిని తీసుకొచ్చినప్పటికీ ఎక్కువ రోజులు షోను కొనసాగించలేకపోవడం కొసమెరుపు. తాజా షో 16 వారాలు కొనసాగేలా ప్లాన్ చేసుకున్నప్పటికీ 15 వారంలోనే ఎండ్ కార్డ్ పెడుతూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వీకెండ్స్ లో నాగార్జున వచ్చినప్పుడు కూడా పెద్దగా రేటింగ్స్ రావడం లేదని టాక్. అందుకే ఆయన కూడా బిగ్ బాస్ కు ఇకనుంచి విముక్తి పలకాలని యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఏదేమైనప్పటికీ బిగ్ బాస్ 6వ సీజన్ రేటింగ్స్ అందుకోవడంలో తీవ్రంగా నిరాశపరిచింది అని అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో చివరి ఎపిసోడ్ కోసమైనా భారీ స్థాయిలో రేటింగ్ తీసుకురావాలి అని నిర్వాహకులు ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకోసం ఫైనల్ ఎపిసోడ్ కోసం బాలకృష్ణ వస్తే బాగుంటుంది అని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. అయితే బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉండటం వలన ఈ షోకి వస్తాడో రాడో అని అనుమానం వుంది. అయితే అతని కళ్ళు పట్టుకునైనా రప్పించాలని బిగ్ బాస్ చూస్తున్నట్టు భోగట్టా.