వాల్తేరు వీరయ్యలో అదే హైలెట్‌… లిప్‌లాక్ కేక పెట్టించింద‌ట‌…!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న పక్కా మాస్ యాక్షన సినిమా
వాల్తేరు వీరయ్య ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. ఇక ఈ సినిమాను సంక్రాంతి కనుగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా శృతిహాసన్ నటిస్తుంది.

Mega 154: Chiranjeevi And Bobby's Upcoming Movie Is Titled 'Waltair Veerayya'…

దీంతోపాటు ఈ సినిమాలో మాస్ మహారాజ్‌ రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ఆయన పాత్రకు సంబంధించిన టీజ‌ర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో రవితేజ విక్రమ్ సాగర్ ఏసీపీగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో మాస్ మహారాజ్ తెలంగాణ యాస‌తో తన క్యారెక్టర్ ఉండబోతుంది. అయితే ఈ సినిమాలో రవితేజ-చిరంజీవితో కలిసి ఎంత రచ్చ చేస్తాడో చూడాలంటే జనవరి వరకు వెయిట్ చేయాల్సిందే.

Poonakalu Loading It Is ! Ravi Teja's 1st Look Teaser From Waltair Veerayya

ఇప్పటికే ఈ సినిమా టీమ్‌ సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ ఇస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ అప్డేట్ ఏమిటంటే.. ఈ సినిమాలో ఒక ఘాడమైన లిప్ లాక్ ఉండబోతుందట. అందులోనూ ఈ సీనియర్ హీరోలు ఈ వయసులో ఆ సన్నివేశాలలో ఎలాంటి రచ్చ చేయబోతున్నారో చూడాలి.

Waltair Veerayya: వాల్తేర్ వీరయ్య నుంచి అదిరిపోయే సాంగ్ ని లీక్ చేసిన మెగాస్టార్ - Rtv Media

వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవికి జంటగా శృతి హాసన్ నటిస్తోంది. ఇక రవితేజతో కేథరిన్ థెస్రా నటిస్తోంది. ఈ సినిమా క‌థ‌ రీత్యా రవితేజ-కేథరిన్ మధ్య గాఢమైన లిప్ లాక్ ఉంటుందట. ఆ సన్నివేశంలో రవితేజ, కేథరిన్ ఎలాంటి మొహమాటం లేకుండా నటించారంటూ విశ్వసనీయవర్గాల నుంచి అందుతున్న‌ సమాచారం.

Catherine Tresa signs a film opposite Ravi Teja | 123telugu.com

మరి చిరంజీవి సినిమాలో రవితేజ ముద్దు సీన్ ఏ స్థాయిలో రొమాన్స్ పంచిందో చూడాలి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వాల్తేరు వీరయ్య చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. విడుదలైన బాస్ పార్టీ సింగిల్ దుమ్మురేపుతోంది. వాల్తేరు వీరయ్య సినిమాపై టాలీవుడ్‌లో మంచి హైప్ నెలకొంది.