ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రం అవతార్-2. ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. 2009లో వచ్చిన అవతార్ సినిమా సృష్టించిన పలు సంచలనాలు ఎలాంటివో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమా కట్టిపడే విజువల్స్.. తో పాటు, వేరే ప్రపంచానికి తీసుకువెళ్లి సరికొత్త అనుభూతిని అవతార్ కలిగించిందని చెప్పవచ్చు. అప్పట్లో ఈ చిత్రం దాదాపుగా రూ.18 వేల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి వరల్డ్ లోనే టాప్ గ్రాస్ మూవీ గా టాప్ టెన్ లో అగ్రస్థానాన్ని అందుకుంది.
ఇక ఈ చిత్రాన్ని సీక్వెల్ తెరకెక్కించిన డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఎట్టకేలకు ఈ సినిమాని ఈ రోజున విడుదల చేసి బాగానే ఆకట్టుకున్నారు. అయితే మొదటి భాగం ఎక్కడ నుంచి ఎక్కడ ఎండ్ అవుతుందో రెండో భాగం అక్కడి నుంచి మొదలవుతుంది. మొదటి భాగంలో పండోరా గ్రహంలోని తెగతో కలిసిపోయిన హీరో జాక్ అదే తెగకు చెందిన హీరోయిన్ నేతేరితో ప్రేమలో పడి వివాహం చేసుకుంటారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి కూడా పుడుతుంది. మొదటి భాగంలో చనిపోయిన డాక్టర్ గ్రేస్ డిఎన్ఏ ఆధారంగా ఒక అవతార్ ను సృష్టించి ఆ అమ్మాయికి కిరి అని పేరు పెడతారు. ఆ కిరీ ని కూడా జాక్ నేతేరి దత్తత తీసుకొని పెంచుతారు.
ఇదిలా ఉండగా మొదటి భాగంలో పండోరా గ్రహంలోని తెగతో ఓడిపోయిన మానవులను.. తిరిగి భూమి పైకి పంపిస్తారు. నావి తెగవాసులు ఒక రోజు రాత్రి మళ్ళీ మానవులు పాండవ గ్రహంపై దండెక్కుతారు. దాంతో అక్కడ ఉండడం సేఫ్ కాదని భావించిన జాక్ కుటుంబం సముద్రవాసుల జీవించే మెట్కయన్ అనే గ్రామానికి వలస వెళ్తారు. ఇక ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.. జాక్ మానవులను ఎలా ఎదుర్కొని జయించాడు.. అనేది పార్ట్ 2.. మొదటి భాగం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినా రెండవ భాగం మాత్రం అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్తో ప్రేక్షకులను అలరిస్తోంది . మోషన్ క్యాప్చర్ 3d టెక్నాలజీ సరికొత్త అనుభూతిని పంచుతుంది. ముఖ్యంగా సాంకేతిక నిపుణులు, నటీనటులు చూపించిన ప్రతిభ మూవీ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది అని చెప్పవచ్చు.