విశాల్ ‘ లాఠీ ‘ విరిగిపోయిందిగా… పవన్ ఫ్యాన్స్‌ను కెలికితే అంతే మరి..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ గురించి ఎవరైనా ఓ చిన్న మాట అన్న వారి అభిమానులు వెంటనే వారిపై సోషల్ మీడియా ద్వారా ట్రోలింగ్ చేస్తూ వారు పవన్ కళ్యాణ్ కు సారీ చెప్పేదాకా ఊరుకోరు. తాజాగా హీరో విశాల్ కూడా పవన్ అభిమానుల చేతిలో సోషల్ మీడియా ద్వారా ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. అయ‌న తాజాగా న‌టించిన సినిమా లాఠీ ఈరోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

లాఠీ సినిమా చూడబోమంటూ విశాల్ పై పవన్ ఫ్యాన్స్ ట్రోల్స్.. ఆ ఒక్క డైలాగ్ తో |  Pawan Kalyan Fans Trolls Vishal , Pawan Kalyan , Vishal , Tollywood ,pawan  Kalyan Fans , Lathi Movie ,AP

అయితే ఈ సినిమా విడుద‌ల‌కు ముందు ప్రమోషన్‌లో విశాల్ మాట్ల‌డుతూ.. ప‌వ‌న్ అంటే నాకు చాలా ఇష్టం నేను సినిమాలోకి రాక ముందు నుంచే అయ‌న నాకు తెలుసు అని ఆయన చెప్పాడు. విశాల్ తండ్రి చిరంజీవితో ఎస్పీ పరశురాం సినిమా సమయంలోనే తను పవన్ కళ్యాణ్ ని చూసినట్టు చెప్పుకొచ్చాడు.. థియేటర్స్ లో పవన్ సినిమా వస్తుందంటే అది నాకు పండుగలా ఉంటుందని చెబుతూ పవన్ కళ్యాణ్ ని పొగడ్తల వర్షంతో ముంచెత్తాడు.

Pawan Kalyan Fans Fires on Vishal And Will Effect on Laththi Movie | 'లాఠీ'  లూటీ అయ్యేలానే ఉంది.. విశాల్‌పై పవర్ స్టార్ ఫ్యాన్స్‌ ఫైర్ News in Telugu

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గురించి కూడా మాట్లాడుతూ.. రాజకీయాల పరంగా తనకు జగన్ అంటే ఎంతో ఇష్టమని.. నాకు ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు ఉంటే మాత్రం జగన్‌కు కచ్చితంగా ఓటు వేసేవాడినని విశాల్ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు జగన్ నే పొగడాలి మధ్యలో పవన్ కళ్యాణ్ ని ఎందుకు లాగడం అంటూ విశాల్ పై వారు మండిపడుతున్నారు.

Vishal: విశాల్ కు గాయాలతో 'లాఠీ' వెనక్కి! - NTV Telugu

అసలు నీకు ఏపీలోనే ఓటు హక్కు లేనప్పుడు అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వటంపై పలువురు సినీ ప్రముఖులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు విశాల్ అన్న మాటలు ఈరోజు విడుదలైన లాఠీ సినిమాపై చాలా ప్రభావం చూపించినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను చూడడానికి మెగా అభిమానులు, పవన్‌ అభిమానులు కూడా థియేటర్ల దగ్గరకు రాలేదు. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే యావరేజ్ టాక్ ని మూట కట్టుకుంది.