చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలతో సమానంగా క్రేజీ తెచ్చుకున్న నటీమణులలో శ్రీదేవి ప్రథమ స్థానంలో ఉంటారు. ఈమె ఏ హీరోతో నటించిన ఆ హీరోకి సరైన జోడి అనిపించుకుంది. 80, 90వ దశంలో తన అందంతో యువతనే కాకుండా సినిమా హీరోలకు కూడా పిచ్చెక్కించింది. ఆ రోజుల్లో ఆమెకు పోటీగా ఎంతమంది నటిమణులు వచ్చినిన శ్రీదేవికి దరిదాపుల్లో కూడా రాలేదు.
ఆమె రెండు తరాల అగ్ర హీరోలతో నటించింది అంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంత క్రేజ్ ఉన్న శ్రీదేవి ఆకస్మిక మరణం అందర్నీ కలిచి వేసింది. ఆమె మరణ వార్త విన్న సినిమా రంగంలో ఉన్న అగ్ర నటుల నుంచి సామాన్య ప్రజల వరకు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకులైన తమ్మారెడ్డి భరద్వాజ ఆమె గురించి మాట్లాడుతూ.. ’80వ దశంలో శ్రీదేవి అంటే యువతలో ఎంతో క్రేజ్ ఉండేది.. దానికి ఉదాహరణగా ఆయన తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చారు’.
‘తెలుగు చిత్ర పరిశ్రమలో నా కెరియర్ మొదలుపెట్టిన తొలి రోజుల్లో దుబాయ్ నుంచి నా స్నేహితుడు ఒకరు ఫోన్ చేసి శ్రీదేవిని చూడటానికి రెండు లక్షల రూపాయిలను ఇస్తానని చెప్పాడు’. ‘షూటింగ్ లో జస్ట్ చూపిస్తే చాలు పరిచయం కూడా చేయవలసిన అవసరం లేదని అన్నాడు’. ఆ రోజుల్లో రెండు లక్షలు అంటే చాలా పెద్ద మొత్తమే. అలాంటిది శ్రీదేవిని చూడటానికి రెండు లక్షలు ఇస్తానని అంటే శ్రీదేవి క్రేజ్ యువతలో ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.