తల్లి వారించినా ఆ విషయంలో వినని హీరోయిన్ కృతి శెట్టి… అది అదేనా?

టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి మన తెలుగు కుర్రాళ్లకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘వీడు ముసలోడు అవ్వకూడదే’ అన్న డైలాగ్ వింటే మనోళ్ళకి కృతి గుర్తుకి వచ్చేస్తుంది. అవును, మొదటి సినిమా ‘ఉప్పెన’తో తెలుగులో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన కృతి అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయిని సంపాదించుకుంది. ఆ సినిమా సక్సెస్ కావడంతో ఆమె తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన పనిలేకుండా పోయింది. కేవలం ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది ఈ చొట్టబుగ్గల బ్యూటీ.

తనదైన అందం, అభినయంతో కుర్రకారును ఫిదా చేస్తోంది. దాంతో నిర్మాతలు ఆమె చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె లక్కీ హీరోయిన్ గా అవతరించింది. ఇక అసలు విషయంలోకి వెళితే, కృతి శెట్టి సినిమాల్లో అవకాశాలు రావడం కోసం హాట్ హాట్ ఫోటో షూట్లను చేస్తూ సోషల్ మీడియాని హీట్ ఎక్కిస్తుందని టాక్ నడుస్తోంది.

అయితే కెరీర్ పిక్స్ లో వున్నపుడు ఇలాంటివి ఎందుకు అని ఆమె తల్లి వారించినా ఈ విషయంలో అమ్మడు వినడం లేదని గుసగుసలు వినబడుతున్నాయి. మరిన్ని ఆఫర్లు చేజిక్కించుకుందామని కృతి ఫిక్స్ అయిందట. ఈ విషయంలో తన తల్లికి కృతికి వాదోపవాదనలు కూడా జరిగినట్టు భోగట్టా. నీ నటనతో నువ్వు అవకాశాలు దక్కించుకోవాలి కానీ, ఇలా చెత్త చెత్త ఫోటో షూట్లు చేస్తే అవకాశాలు వస్తాయా? అని అన్నప్పటికీ… తన తల్లి మాటను పక్కనపెట్టి హాట్ హాట్ ఫోటో షూట్లను చేస్తూ కుర్రకారుని కిర్రెక్కిస్తుందని నెటిజనులు చర్చించుకుంటున్నారు.