జబర్దస్త్ వ‌దిలేశాక అనసూయ ప‌రిస్థితి ఇలా అయ్యిందే…?

టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ జబర్దస్త్ షో నుంచి బయటకు వెళ్ళిపోయాక ఆమె ఏం చేస్తుంది అంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. మొన్నటి వరకు స్టార్ మా లో కామెడీ స్టార్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కనిపించన అనసూయ తర్వాత నుంచి బుల్లితెరపై కనిపించడం లేదు.
యాంకరింగ్ కు స్వస్తి చెప్పి వరుస‌ సినిమాలకు కమిట్ అవుతుంది. ఆ సినిమాలలో నటిస్తుందా అంటే అది లేదు.. ఇంత వరకు ఏం చేస్తుంది అంటూ ఆమె అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

గత సంవత్సరం అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో అనసూయ నటించి అందరిని మెప్పించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వల్ గా రాబోతున్న పుష్ప2లో కూడా ఈమె నటించబోతుంది. ఈ సినిమా తర్వాత ఈమె ఏ సినిమాలో నటిస్తుందో కూడా ఎవరికీ క్లారిటీ లేదంటూ అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Anasuya Bharadwaj's first look from 'Pushpa' fails to enthuse fans - Telugu  Bullet

సినిమాల్లో ఛాన్సులు వస్తున్న కారణంగా జబర్దస్త్ షో నుంచి బయటికి వచ్చిన అనసూయ.. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ఆమెకు ఆఫర్ ఇచ్చిన సినిమాల షూటింగ్ ఇంకా మొదలవకపోవడంతో ఆమె ఖాళీ గానే ఉంటుంది. దీంతో ఆమె అభిమానులు జబర్దస్త్ షో కి డేట్లు కేటాయిస్తే బాగుంటుంది కదా అంటూ ఆమెకి సోషల్ మీడియా ద్వారా కామెంట్‌లు పెడుతున్నారు. ఈ సమయంలోనే ఆమె యొక్క సినిమాలు మరియు ఇతర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

భారీ అంచనాల నడుమ రూపొందిన సినిమాల్లో ఆమె పెద్దగా సందడి చేస్తున్న దాఖలాలు కూడా లేవు. మరి అనసూయ ఏం కోరుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. కానీ అనసూయ సన్నిహితులు మాత్రం ఆమె బిజీ బిజీగా ఉందని వరుసగా సినిమాల్లో నటిస్తుందని చెప్పుకొస్తున్నారు.