సూపర్ స్టార్ రజినీకాంత్ ఏమిటి? ఫస్ట్ లవ్ కోసం ఎదురు చూడటం ఏమిటని అనుకుంటున్నారా? ఆ కధ తెలుసుకోవాలంటే మీరు ఈ కధ పూర్తిగా చదవాల్సిందే. తలైవా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సౌత్ హీరోకి యావత్ ఇండియా రేజ్ లో అభిమానులు వున్నారంటే అది రజని కాంత్ నే. సిల్వర్ స్క్రీన్ పైన అతడు ఓ సూపర్ హీరో. అతని స్టయిల్ కి ఎంత అందమైన అమ్మాయి అయినా ఫిదా అవ్వాల్సిందే. అలాంటిది రజినీకాంత్ నిజ జీవితంలో ఓ భగ్న ప్రేమికుడన్న విషయం చాలా మందికి తెలియదు.
అవును, రజినీకాంత్ అప్పట్లో ప్రేమించి… సూపర్ స్టార్ అయ్యేలా ప్రేరేపించిన ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే అవాక్కవుతారు. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ కి వెళితే… రజనీ ఇండస్ట్రీలోకి రాకముందు బెంగళూరులో బస్ కండక్టర్గా ఉద్యోగం చేసే వాడనే విషయం విదితమే. ఆ రోజుల్లో MBBS చదివే ఒక అమ్మాయి తరచుగా రజనీకాంత్ డ్యూటీ చేసే బస్సులోనే ప్రయాణం చేసేదట. దాంతో వీరిద్దరి మధ్య క్రమంగా పరిచయం పెరిగి, ఒకరినొకరు ప్రేమించుకున్నారట. అంతే కాదు అదే సమయంలో తాను నటించే ఒక నాటకానికి ఆ అమ్మాయిని రజనీకాంత్ ఆహ్వానించారట.
ఆ తరువాత కొన్ని రోజులకు రజనీకాంత్ కి చెన్నైలోని అడయార్ ఇన్స్టిట్యూట్ కి రావాల్సిందిగా ఒక లెటర్ రావడం కొసమెరుపు. దాంతో రజనీ ఆశ్చర్యపోయాడట. ఇంతలో ఆ అమ్మాయి లెటర్ వచ్చిందా? అని రజినీకాంత్ ను అడిగిందట? దాంతో విషయం అర్ధం అయిన రజనీ నువ్వే అప్లై చేసావా? అని రజనీ అడగగా అవును, నువ్వు సూపర్ స్టార్ హీరో అవ్వాలి! అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించిందట ఆ అమ్మాయి. అంతేకాకుండా అక్కడికి వెళ్ళడానికి డబ్బులు లేకపోతే ఆ అమ్మాయే ఇచ్చి మరీ పంపింది. కానీ తరువాత తరువాత రజనీ ఎంత ప్రయత్నించినా ఆమె జాడ మాత్రం తెలియలేదట. నాటి నుండి నేటి వరకు ఆ అమ్మాయి రాక కోసం రజనీ ఎదురు చూస్తున్నారట. కాగా ఈ విషయాన్నీ నటుడు దేవన్ శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.