వైరల్ అవుతున్న మహేశ్ గారాలపట్టి లేటెస్ట్ ఫొటోస్… తండ్రిని మించిన అందం ఆమెది!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, అతని కుటుంబం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. మహేష్ బాబుకి కుటుంబం పెద్ద బలం. మహేష్ – నమ్రత స్వీట్ డాటర్ సితారా ఘట్టమనేని పరిచయం కూడా అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా సితారా నెటిజన్లను అప్పుడప్పుడు పలకరిస్తుంటుంది. అలాగే ఇటీవల తండ్రితో కలిసి ‘సర్కారు వారి పాట’లో కూడా అదిరిపోయే డాన్స్ తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. రీల్స్ తో.. ఫన్నీ వీడియోలతో, తన తండ్రికి తక్కువేమి కాను అంటూ స్కిల్స్ చూపిస్తుంటుంది.

రీసెంట్ గా 10 లక్షల మంది ఫాలోవర్స్ ను దక్కించుకుని ఇన్ స్టాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది సితారా. అవును, ఈ క్రమంలోనే తాజాగా ఈ స్టార్ కిడ్ చేసిన ఫొటోషూట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్, నెటిజన్లు సితారాను ఆకాశానికెత్తేస్తున్నారు. మహేశ్ బాబుకి తగ్గ తనయ అంటూ పొగిడేస్తున్నారు. మరికొందరు సితారా ఫ్యూచర్ హీరోయిన్ గా చక్రం తిప్పడం గ్యారంటీ ని అంటున్నారు. కాగా ఈ బ్యూటిఫుల్ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.

ఇక ఆమధ్య ఓ టీవీ షోలో కూడా తండ్రి కూతురు కలిసి సందడి చేసిన విషయం తెలిసినదే. మరోవైపు గౌతమ్ ఘట్టమనేని కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా 1 నేనొక్కడినేలో అలరించిన సంగతి తెలిసిందే. కాగా సితారా CHIREC ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతోంది. పెయింటింగ్, డాన్స్, సింగింగ్ లో కూడా పట్టు సాధిస్తోంది. ఒకవైపు చదువులో రాణిస్తూనే.. మరోవైపు యూట్యూబర్ గా, డాన్సర్ గా సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకుంటోంది.