సుగుణ సుందరి మేకింగ్ వీడియో చూశారా.. బాల‌య్య అల్ల‌రి మామూలుగా లేదు!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ శ్రుతిహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హ‌నీ రోజ్‌ తదితరులు కీలక పాత్రల‌ను పోషించారు. త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు.

ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను బయటికి వదులుతూ సినిమాపై హైప్‌ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు బయటికి వచ్చాయి. అందులో `సుగుణ సుందరి` ఒకటి .బాలయ్య శ్రుతిహాసన్ ల‌పై చిత్రీకరించిన డ్యూయెట్ సాంగ్ ఇది. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను రామ్‌ మిర్యాల, స్నిగ్ధ శర్మ అల‌పించారు.

 

ఇటీవల బయటికి వచ్చిన ఈ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను మేకర్స్ బయటకు వెళ్లారు. ఈ వీడియోలో బాలయ్య అల్లరి మామూలుగా లేదనే చెప్పాలి. టర్కీలోని అందమైన లొకేషన్స్ లో ఈ సాంగ్ ను షూట్ చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ సాంగ్ లో బాల‌య్య‌, శ్రుతిహాసన్ సూపర్ స్టైలిష్ గా డాన్స్ చేసి అదరగొట్టారు. మొత్తానికి సుగుణసుందరి మేకింగ్ వీడియో నెట్టింట‌ వైరల్ గా మారింది.