భర్త చనిపోయినా మరో పెళ్లి చేసుకోని నటీమణులు వీరే..

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఒక కీలక ఘట్టం. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ వారు వివాహ బంధానికి పెద్దగా విలువ ఇవ్వడం లేదు. ఒకప్పుడు భర్త చనిపోతే మళ్ళీ వివాహం చేసుకోకుండా, భర్త జ్ఞాపకాలతోనే బ్రతికే వారు. అలాంటిది ఇప్పుడు మాత్రం ఒంటరి జీవితం జీవించలేక చాలా మంది భర్త పోయిన కొన్ని రోజులకే రెండో వివాహం చేసుకొని హ్యాపీగా ఉంటున్నారు. ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీలో కూడా చూస్తూనే ఉంటాం. అయితే భర్త చనిపోయిన కూడా మళ్లీ వివాహం చేసుకోకుండా వారి జ్ఞాపకాలతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న యాక్టర్స్ గురించి తెలుసుకుందాం.

సురేఖ వాణి

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో మంచి పాత్రలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది సురేఖ వాణి. తన సహజ నటన చూసి సురేఖ వాణిని ప్రేక్షకులకు తమ ఇంటి మనిషిలా భావిస్తారు. అయితే 2018లో సురేఖ వాణి భర్త సురేష్ తేజ్ చనిపోయారు. ఇక తన భర్త జ్ఞాపకాలను మర్చిపోలేక రెండో వివాహం చేసుకోకుండా తన కూతురిని చూసుకుంటూ జీవిస్తుంది.

రాగిణి

రాగిణి కొన్ని సీరియల్స్ లో నటించింది. అంతే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసింది. అయితే ఆమె భర్త వివాహం జరిగిన కొద్ది రోజులకే మరణించారు. ఇక అప్పటినుండి ఆమె మరో పెళ్లి చేసుకోకుండా తన అక్క పిల్లలతో జీవితాన్ని కొనసాగిస్తుంది.

విషిత

టాలీవుడ్ లో తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకొని 2014 లో మరణించారు. ఆయన భార్య విషిత ఇప్పటికి వివాహం చేసుకోకుండా ఉదయ్ కిరణ్ జ్ఞాపకాలతో బ్రతుకుతుంది.

రోహిణి

సీనియర్ నటి రోహిణి భర్త రఘువరన్. కొన్ని కారణాల వళ్ళ రోహిణి తన భర్తతో విడిపోయింది. ఆలా అని ఆమె మళ్ళీ వివాహం చేసుకోకుండా తన భర్త మనసు మరి ఆమెకి దగ్గరవుతారని ఎదురుచూసింది. కానీ ఆయన మరణించారు. అయిన కూడా ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోలేదు.

డిస్కో శాంతి

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న డిస్కో శాంతి, స్టార్ హీరో అయినటువంటి శ్రీహరిని వివాహం చేసుకుంది. శ్రీహరి మరణించిన తరువాత కూడా డిస్కో శాంతి మళ్ళీ వివాహం చేసుకోలేదు.