ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఇది ప్రత్యక్షంగా కాదు.. పరోక్షంగానే! అయినా కూడా.. భారీ దెబ్బేనని అంటున్నారు పరిశీలకులు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఏపీలో సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాలు.. తాజాగా విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ వెంకట్రామిరెడ్డి విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈయనకు వైసీపీ సానుభూతిపరుడుగా పేరుంది. పైగా.. సీఎం జగన్ సొంత జిల్లాకుచెందిన వ్యక్తి.
అంతేకాదు.. అవకాశం వచ్చిన ప్రతిసారీప్రభుత్వాన్ని ప్రశంసలతో నింపేసేవారు. సో.. ఈయన మళ్లీ గెలవడం.. టీడీపీకి బిగ్ షాక్ అనే అంటున్నారుపరిశీలకులు. ఎందుకంటే.. ఉద్యోగుల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరకత ఉందని టీడీపీ నమ్ముతోంది. సమయానికి జీతాలు ఇవ్వడం లేదేని.. కనీసం వారు దాచుకున్న జీపీఎఫ్ సొమ్మును కూడా ఇవ్వకుండా వాడుకుంటోందని.. టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో ఇది తమకు లాభిస్తుందని లెక్కలు వేసుకున్నారు.
మరీ ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు మరింత ఆగ్రహంతో ఉన్నారని.. వారి అధికారాలకు కత్తెర పెట్టి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారనేది టీడీపీ వాదన. ఈ క్రమంలోనే సచివాలయ ఉద్యోగుల సంఘంలో వెంకట్రామిరెడ్డిపై ప్రత్యర్థిగా పోటీ చేసిన రామకృష్ణకు టీడీపీ తెరచాటు మద్దతు పలికిందని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే.. ఈ ఎన్నికల్లో రామకృష్ణ ఘోరంగా ఓడిపోయారు. అదే సమయంలో గతానికంటే ఎక్కువ మెజారిటీతో వెంకట్రామిరెడ్డి విజయందక్కించుకున్నారు.
అంతేకాదు.. ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారని భావిస్తున్న భావిస్తున్న ఉద్యోగులు కూడాసర్కారుతో అంటకాగుతూ.. తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న నాయకుడికే ఓట్లేయడం.. ఇప్పుడు టీడీపీకి మింగుడు పడడంలేదు. అదే వెంకట్రామిరెడ్డి ఓడిపోయి ఉంటే.. దానిని వైసీపీ ఓటమిగా.. సీఎం జగన్కు ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో ఇదే ఫలితం వస్తుందని ప్రచారం చేసుకు నేందుకు అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ కావడంతో టీడీపీ నేతలకు బిగ్ షాక్ తగిలిందని అంటున్నారు పరిశీలకులు.