బాలీవుడ్ హాట్ బాంబ్ తో రామ్ ఆట పాట‌.. బోయ‌పాటి గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు!?

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. `అఖండ` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం బోయపాటి నుండి రాబోతున్న చిత్రం ఇది.

ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

అదేంటంటే ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ బాంబ్ ఊర్వ‌శి రౌటెలాతో రామ్ ఆట పాట ఉండబోతుందట. ఇంతకీ విషయం ఏంటంటే బోయపాటి ఈ చిత్రంలో ఓ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఆ సాంగ్ కోసం ఊర్వ‌శి రౌటెలాను రంగంలోకి దింపుతున్నారట. ఇప్పటికే ఊర్వశిని సంప్రదించారని ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయిందని అంటున్నారు. అంతేకాదు ఈ స్పెషల్ సాంగ్ సినిమాకు హైలెట్ గా కూడా నిలవబోతోందట. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు బోయపాటి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.