తాప్సీ హెడ్ వెయిట్..చిన్న పాపతో వల్గర్ ప్రవర్తన..వీడియో వైరల్..!!

టాలీవుడ్ లో పద్ధతిగా రోల్స్ చేసుకుంటూ మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్స్ ..బాలీవుడ్ లో ఆఫర్స్ రాగానే అక్కడికి ఊపేద్దామని ..చించేద్దామని ..ఎగేసుకుని వెళ్లి ఏమీ ఊపలేక.. ఏమి చించలేక ఊప్పుకుంటూ తిరుగుతున్న హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. వాళ్లలో ముందు వరుసలో ఉంటుంది తాప్సి అంటూ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే .

నిజానికి ఈ సొట్టబుగ్గల సుందరి చాలా ఓపెన్ మైండెడ్ పరసన్ అని..మనసులో ఏది ఉన్న ఓపెన్ గా చెప్పేస్తుంది అని ..అంతా అంటుంటారు. కాగా బాలీవుడ్ కి వెళ్ళాక తాప్సి బోల్డ్ రోల్స్ చేస్తూ చాలా బోలెడుగా తయారైంది అంటూ ఈ మధ్యకాలంలో జనాలు వివరించారు. అంతేకాదు తెలుగులో ఆఫర్స్ వచ్చిన తన హెడ్ వెయిట్ కారణంగా రిజెక్ట్ చేసిందన్న కామెంట్స్ వినిపించాయి. ఈ మధ్యకాలంలో తాప్సి చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో తాప్సి ఫుల్ చిరాకులో ఉంది. అంతేకాదు సోషల్ మీడియాలో వచ్చే మీమ్‌స్, ట్రోలర్స్ కు ఘాటుగా జవాబిస్తుంది .

కాగా రీసెంట్ గా తాప్సికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఆమె ఓ మాల్ నుంచి బయటకు వస్తూ కార్ ఎక్కుతుండగా మీడియా పర్సన్స్ కొందరు ఫోటో ఇవ్వమని అడుగుతుంటే ఆమె ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉన్నింది. ఈ క్రమంలోనే ఆ పక్కనే ఉన్న పాప భిక్షాటన చేస్తూ తాప్సి వెంటపడింది. ఈ క్రమంలోనే పాప తన కార్ డోర్ ను గట్టిగా పట్టుకుంది. కానీ ఆమె పట్టించుకోకుండా కారు లోపలికి ఎక్కుతూ ఉంటే.. పాప గట్టిగా డోర్ పట్టుకోవడంతో కోపనికి గురైన తాప్సి..”ఐసా మత్ కరో..” అంటూ పాప పై విరుచుకుపడింది. దీంతో అక్కడే ఉన్న మీడియా పర్సన్స్ దీనిని వీడియో రికార్డ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ బాలీవుడ్ కి వెళ్ళాక బాగా బలిసిన్నట్లు బిహేవ్ చేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)