మరోసారి అందాల ఆరబోతలో కంచెలు తెంచేసిన ప్రగ్యా జైస్వాల్.. అయినా ఆఫర్లు రావడం లేదే!

ప్రగ్యా జైస్వాల్.. `కంచె` సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఆ తర్వాత తీసిన సినిమాలు ఏవి కూడా అంత మంచి విజయాన్ని అందుకోలేదు. అయితే ఇటీవల మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `అఖండ` సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ యాక్షన్ సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రగ్యాకు కూడా మంచి మార్కులు పడ్డాయి. అయితే గ్లామర్ షో చేయడంలో ఈమె తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రగ్యా డిజైనర్ దుస్తుల్లో వరుస ఫోటోషూట్లతో టెంప్టింగ్ ఎలివేషన్స్ తో కుర్ర కారులో అగ్గిరాజేస్తూ ఉంటుంది. తాజాగా ప్రగ్యా హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది.

ఆ ఫోటోలలో ఆమె లేలేత పచ్చ వర్ణం పువ్వులా.. షోల్డర్ లెస్ బ్లౌజ్ మరియు స్కర్ట్ అందాలతో చూపులతో కవ్విస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మ జీరో లుక్ లో క్లోవేజ్ షో మెయిన్ హైలెట్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు మరోసారి అందాల ఆరబోతలో కంచెలు తెంచేసిన ప్రగ్యా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఇటీవల వచ్చిన `అఖండ` సినిమాతో మంచి గుర్తింపు పొందింది కానీ.. ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం ఈమెకు ద‌క్క‌డం లేదు . అంతేకాక సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ పాపులాటీని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆఫర్లు రావడం లేదు. ఏదేమైనాప్పటికీ ఆఫర్లు విషయం పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ క్లోవేజ్ షోకి మాత్రం ఫాలోయింగ్ భారీగా పెరిగిపోతుంది.