మా ఇద్దరి రిలేషన్ అదే..అందరి ముందు శ్రీకాంత్ తో ఉన్న సంబంధాని ఓపెన్ గా చెప్పేసిన లైలా..!!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లైలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. లైలా టాలీవుడ్ ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలో న‌టించింది. ఆమె సినిమా వ‌స్తుంది అంటేనే అభిమానుల‌కు పెద్ద పండుగా లాగా ఉండేది. ఆమెను చూసేందుకే చాలామంది అభిమానులు సినిమా ధియేటర్స్ కి వెళ్ళే వాళ్లు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి.

Laila to make her tamil cinema acting comeback with karthi sardar movie |  Galatta

లైలాను టాలీవుడ్ కు పరిచయం చేసింది ఎస్వీ కృష్ణారెడ్డి. 1997లో ‘ఎగిరే పావురమా’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ గోవా బామ్మ‌. ఆ సినిమాలో శ్రీకాంత్ కు జంటగా లైలా నటించింది. ఈ సినిమా మొత్తం హీరోని ‘కొలబద్ద’ అంటూ ఆట పట్టిస్తుంది లైలా. పిల్లలతో పద్యం కూడా పాడిస్తుంది. ఇకా ఆ సీన్ ఇప్పటికీ నవ్వులు పూయిస్తుంది. అయితే సినిమాలో లాగానే బయటకూడా శ్రీకాంత్ ని అలానే ఆట పట్టిస్తుందట లైలా.

ఇప్పటికీ కూడా శ్రీకాంత్ ని లైలా ‘కొలబద్ద అనే పిలుస్తుంద‌ట‌. 16 ఏళ్ల తర్వాత మ‌ళ్లీ ‘సర్దార్’ సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకురాబోతుంది లైలా. కార్తీక్ హీరోగా నటించిన ఈ సినిమాలో లైలా ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ సినిమా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే చిత్ర యూనీట్‌ తాజాగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఆ వెంట్ లో పాల్గొన్న లైలాను స్టేజీ మీదకు పిలుస్తూ.. ‘కొలబద్ద’ అని యాంకర్ పిలిచారు .

Sardar: Teaser and First Single from Karthi's Spy Action Thriller to Be out  Soon! (View Poster) | 🎥 LatestLY

దీంతో లైలా తన పాత రోజులను గుర్తు చేసుకుంది.. ఇప్పటికి శ్రీకాంత్ ని ఆ పేరుతోనే పిలుస్తానని చెప్పుకొచ్చింది. ఇక‌ సినిమా గురించి మాట్లాడుతూ.. “సర్దార్ నాకు చాలా స్పెషల్ అని. నేను నటించిన శివ పుత్రుడు దీపావళికి విడుదలైన ఘన విజయం సాధించింది. సర్దార్ కూడా అదే రోజు విడుద‌ల అవుతుంది. దీపావళి రోజున‌ నా పుట్టినరోజు కూడా.. కార్తీక్ గారు ఎంతో అద్భుతంగా నటించారు. ఇది చాలా మంచి సినిమా మీరు థియేటర్లో చూసి ఎంతో ఎంజాయ్ చేస్తారు”.. అని లైలా తన ప్రసంగాన్ని ముగించింది.