త్వరలో కీర్తి సురేష్ వివాహం… వరుడు ఇతనే అట?

కీర్తి సురేష్.. ఈ మహానటి గురించి అందరికీ తెలిసిందే. నేను – శైలజ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తరువాత వచ్చిన మహానటి సినిమా ఆమె జీవితంలో ఓ మైలురాయిగా మిగిలిపోయింది. ఆ సినిమాకి గాను ఆమె జాతీయ ఉత్తమనటి పురస్కారం అందుకొని రికార్డ్ సృష్టించింది. ఇక ఇటీవల మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటించి మెప్పించింది. ఇకపోతే కీర్తి ఇంట ఇపుడు పెళ్లి బాజాలు మోగబోతున్నాయని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి.

బేసిగ్గా తెలుగు హీరోయిన్లకు పెళ్లిళ్లు కావు అనే నానుడి వుంది. అందుకే చాలామంది కెరీర్ పీక్స్‌లో వున్నప్పుడే పెళ్ళి చేసేసుకుని, వైవాహిక జీవితంలోకి సెటిలై పోవాలని చూస్తున్నారు. ఆ లిస్టులో కీర్తి సురేష్ కూడా చేరిపోనుందా అంటే, అవుననే వార్తలు వస్తున్నాయి. అవును, తాజాగా కీర్తి సురేష్ పెళ్ళి విషయమై సోషల్ మీడియాలో రకరకాల గాసిప్స్ షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో వరుడెవరంట? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇకపోతే కీర్తి సురేష్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఓ యువ పారిశ్రామికవేత్తతో ఆమె పెళ్ళి జరగనుందంటూ ప్రచారం వుంది.

అయితే అతను వ్యాపార దృష్ట్యా గల్ఫ్ దేశాల్లోనే ఎక్కువ గడుపుతాడట. దండిగా సంపాదిస్తున్నాడట. దాంతో కీర్తి సురేష్ ఫామిలీ ఓకే చెప్పిందని టాక్ వినబడుతోంది. కాగా ఈ ప్రచారాన్ని కీర్తి సురేష్ సన్నిహితులు కొట్టి పారేస్తున్నారు. కీర్తి సురేష్ కుటుంబంలో అసలు పెళ్ళి గురించి చర్చలే నడవడం లేదని, ప్రస్తుతం ఆమె దృష్టి పూర్తిగా సినిమాల మీదనే వుందని అంటున్నారు. అయితే ఇది విన్న నెటిజన్లు మాత్రం… ఏ పుట్టలో ఏ పాము దూరిందో… అలా చెప్పే కాజల్ అగర్వాల్ అనూహ్యంగా యూ టర్న్ తీసుకుని పెళ్ళి పీటలెక్కేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.