రెడ్ డ్రెస్‌లో `ఒంగోలు గిత్త` భామ ఘాటు అందాలు.. పిక్స్ చూస్తే మైండ్ బ్లాకే!

`ఒంగోలు గిత్త` సినిమాలో రామ్ సరసన హీరోయిన్గా నటించిన కృతి కర్బందా.. ఈ సినిమా కన్నా ముందే పవన్ కళ్యాణ్ `తీన్ మార్` సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఒంగోలు గిత్త సినిమాలో హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ `బ్రూస్లీలో` మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్ కి అక్క పాత్రలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.

కృతి కర్బందా హీరోయిన్ గా ఈ పాత్రతో పలు విమర్శలు కూడా ఎదుర్కొంది. ఈమెకు సరైన అవకాశాలు లేకపోవడంతో తెలుగు సినిమాలలో పెద్దగా కనిపించలేదు. అయితే ఆమె కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో కూడా కొన్ని సినిమాలు నటించగా అవి కూడా అంతా మంచి సక్సెస్ను సాధించలేక పోయాయి. అయితే కృతి కర్బంద చాలా రోజుల గ్యాప్ తర్వాత సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది.

 

రెడ్ హాట్ డిజైన్ వేర్ ధరించిన ఈ ఒంగోలు గిత్త భామ ఘాటు అందాలు చూపిస్తూ డిఫరెంట్ ఫోజులిస్తుంది. రెండు చేతులు పైకెత్తి, ఒంటి కాలిపై నిలబడి కంప్లీట్ గా థైస్ ను ఎక్స్పోజ్ చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపుతుంది. అయితే ఫోటో షూట్ లో బిజీగా ఉన్న నా దగ్గరకు వచ్చి “డ్రాగో హస్కీ” ఉచిత సలహాలు ఇస్తుంది అంటూ హాట్ ఫోటోలు కు ఫన్నీ క్యాప్షన్ ఇచ్చింది కృతి కర్బందా. ప్రస్తుతం ఆమె చేసిన ఫన్నీ క్యాప్షన్ తో పాటు రెడ్ డ్రస్సులో ద‌గదగా మెరిసిపోతున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.