హీరోయిన్లు బేసిగ్గా ఇలాంటి ఆహారాన్నే తింటారు.. అందుకే అంత అందంగా వుంటారు!

బేసిగ్గా మన సినిమా హీరోయిన్లను చూడగానే సగటు మహిళలు ‘యెంత అందంగా వున్నారో.. ఏం తింటున్నారో?’ అని మనసులో అనుకుంటూ వుంటారు. ఇది సహజమే. అయితే బయట వారు అలాంటి తిండి తింటారు, ఇలాంటి తిండి తింటారు అనే రూమర్స్ వినబడుతూ ఉంటాయి. ఇపుడు నిజంగా వాళ్ళు ఎలాంటి తిండిని ఇష్టంగా తింటారో తెలుసుకుందాం. హీరోయిన్ల పెట్టుబడి అందం కనుక వారు చాలా స్ట్రిక్ట్ గా డైట్ మెయింటైన్ చేస్తూ వుంటారు. అంతకుముందు ఎలా ఉన్నా ఇండస్ట్రీలోకి అడుగుపెడితే తిండిని కంట్రోల్ చేయకతప్పదు. లేకపోతే శరీరాకృతి పాడైపోతుంది.

కానీ ఒక్కోసారి వారికిష్టమైన ఆహారం కనిపిస్తే అన్ని మరిచిపోయి, అవసరానికి మించి లాగించేసి తృప్తి పడుతూ వుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో వీరు నటిస్తూ, తమ అందచందాలను ఆరబోస్తూ మొదటి నుంచి ప్రత్యేకమైన ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకుంటున్నారు. ముందుగా సౌత్ సూపర్ స్టార్ హీరోయిన్ అయిన సమంత గురించి తెలుసుకుందాం. ఈమె పాలకోవ, డైరి మిల్క్, చాక్లెట్, చక్కెర పొంగల్, సుషీ వంటి ఆహారపదార్ధాలను ఇష్టంగా తింటుంది. బేసిగ్గా తీపి పదార్థాలతో లావవుతారు. కానీ సమంత అప్పుడప్పుడు వీటిని ఎంతో ఇష్టంగా తీసుకుంటుంది.

బేసిగ్గా యోగా టీచర్ అయిన అనుష్క చికెట్ వంటకాలను ఇష్టంగా లాగించేస్తుందట. అలాగే అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ ఆలూ పరాటా, గులాబ్ జాబ్ ఇష్టంగా తింటుంది. తమిళ భామ కీర్తి సురేశ్ సాంప్రదాయ వంటకాలనే ఎక్కువగా ఇష్టపడుతారు. పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే బిర్యానీ ఎప్పుడు దొరుకుతుందాని ఎదురుచూస్తూ ఉంటుందట. హీరోయిన్ రష్మిక మందానకి దోశలంటే చాలా ఇష్టమట. బొద్దుగుమ్మ రాశీఖన్నాకు చైనా ఫుండ్ అంటే చాలా ఇస్టమట. అలాగే మరో బొద్దుగుమ్మ నిత్యామీనన్ దక్షణాది వంటకాన్నింటినీ ఆరగించేస్తుందట.