ఎన్టీఆర్‌-కొర‌టాల సినిమాకు టైటిల్ ఖ‌రారు.. అస‌లు న‌మ్మేలా లేదే?!

జూనియర్ ఎన్టీఆర్.. `త్రిబుల్ ఆర్` వంటి సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న తర్వాత ఆయన ఇప్పటివరకు ఎలాంటి సినిమా షూటింగ్స్ లో పాల్గొన లేకపోవడంతో ఆయన అభిమానులు తీవ్రమైన నిరాశకు గురైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కొరిటాల శివ డైరెక్షన్లో తన తదుపరి సినిమా ఉంటుందని ప్రకటించి చాలా రోజులు అవుతున్నప్పటికీ కూడా ఆ సినిమాకి సంబంధించి కనీసం పూజా కార్యక్రమం కూడా చేయకపోవడంతో ఎన్టీఆర్ అభిమానుల సహనంకి పరీక్ష పెట్టినట్టు అయింది.

అయితే ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు తాజాగా ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న‌ ఒక వార్త కాస్త ఊరటనే కలిగిస్తుంది. ఇక ఆ వార్త ఏమిటంటే.. ఎన్టీఆర్-కొరటాల సినిమాకి సంబంధించిన పనులు చకచకా అవుతున్నాయట. అంతేకాకుండా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ని కూడా ఖరారు చేసినట్టు ఇండస్ట్రీ నుండి వార్తలు వినిపిస్తున్నాయి.

NTR 30 To Get More Delay

నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారి కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన `ఆ ఒక్కటి అడక్కు` అనే టైటిల్ను ఎన్టీఆర్ సినిమాకి కొరటాల శివ ఫైనల్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన వీడియో గ్లిమ్స్ కి ఇప్పుడు వినిపిస్తున్న ఈ కామెడీ టైటిల్ కి అస్సలు సంబంధమే లేదే అని అభిమానులకి అనిపించడం సహజం. దానికి కారణం అప్పుడు అనుకున్న కథ ప్రస్తుతం ఇప్పుడు అనుకున్న కథ ఒకటి కాదట.

అయితే ఆ కథకి సెకండ్ హాఫ్ సరిగ్గా లేకపోవడంతో వేరే కథని రెడీ చేయమని ఎన్టీఆర్ సూచించడంతో.. ఆయన సూచనల మేరకు ఈ లేటెస్ట్ వర్షన్ ని రాసుకున్నారని సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలోనే పట్టాలెక్కనుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.