టీడీపీ సీట్లలో వైసీపీ ఇంచార్జ్‌లు చేంజ్?

మళ్ళీ అధికారంలోకి రావడానికి జగన్ గట్టిగానే కష్టపడుతున్నారు…గతం కంటే ఈ సారి ఎక్కువ సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీకి ఉన్న సానుకూలత ఈ సారి ఎన్నికల్లో ఉండటం కష్టం. ఈ సారి అంత ఈజీగా వైసీపీకి గెలుపు దక్కదు. అందుకే జగన్…నెక్స్ట్ గెలవాలంటే ఇప్పుడు వైసీపీలో భారీ మార్పులు అవసరమని భావిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు, ఇంచార్జ్‌ల పనితీరుపై వచ్చిన పీకే టీం సర్వే నివేదికల ఆధారంగా పార్టీలో మార్పులు చేయడానికి జగన్ సిద్ధమవుతున్నారు.

ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్న ఎమ్మెల్యేలు ఉన్నచోట అదనపు ఇంచార్జ్‌లని పెట్టడానికి జగన్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తాడికొండ స్థానంలో మార్పు చేశారు. అక్కడ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై వ్యతిరేకత ఎక్కువే ఉంది..నెక్స్ట్ ఆమె గెలుపు కష్టమని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాడికొండలో అదనపు సమవయకర్తగా డొక్కా మాణిక్యవప్రసాద్‌ని నియమించారు.

దీని ద్వారా నెక్స్ట్ ఎన్నికల్లో శ్రీదేవికి సీటు లేదని చెప్పకనే చెప్పారు. ఇలా పలు స్థానాల్లో మార్పులు చేయాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో కూడా ఇంచార్జ్‌లని మార్చాలని జగన్ చూస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నా సరే టీడీపీ గెలిచిన స్థానాల్లో బలం పెరగలేదు. ఇంచార్జ్‌లు ఎంతసేపు అధికార బలాన్ని ప్రదర్శించే పనిలో ఉన్నారు తప్ప…పార్టీ బలాన్ని పెంచే పనిలో ఉన్నారు. దాని వల్ల పలు స్థానాల్లో వైసీపీ వెనుకబడి ఉంది. అలాంటి స్థానాల్లో ఇంచార్జ్‌లని మార్చేయాలని జగన్ ఫిక్స్ అయ్యారు.

పర్చూరు, కొండపి, టెక్కలి, విశాఖ తూర్పు, విశాఖ దక్షిణ, రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, పాలకొల్లు, హిందూపురం స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు…ఈ స్థానాల్లో వైసీపీ ఇంచార్జ్‌లుగా ఉన్నవారిని మార్చేసి…కొత్తవారిని పెట్టాలని జగన్ చూస్తున్నారు..అయితే విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్…వైసీపీలోకి వచ్చారు. మరి ఆయనకు సీటు ఫిక్స్ చేస్తారా? లేదా? అనేది డౌట్. మొత్తానికి టీడీపీ సిట్టింగ్ సీట్లలో వైసీపీ ఇంచార్జ్‌లు మారే అవకాశాలు ఉన్నాయి.