టీడీపీ లో జూ.ఎన్టీఆర్ తో అధికార మార్పిడి!!

ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా బేటీ ఇపుడు ఎన్నో వివాదలకు తెర తీస్తోంది..ఇదే విషయం వైసీపీలో కొడాలి నాని కూడా రాజకీయ ప్రయోజనం లేకుండా నరేంద్ర మోడీ, అమిత్ షా ఎవరినీ కలవరన్నారు..మరి రాజకీయ వ్యూహంతోనే అమిత్ షా,జూ.ఎన్టీఆర్ ని కలిసిరా?? నటన గురించి జూ.ఎన్టీఆర్ ని అబినందించటానికి జూ.ఎన్టీఆర్ ఏమి సాధారణ నటుడు కారు,ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన నటుడికి ఇపుడు కొత్తగా నటన గురించి ప్రశంసలు అక్కర్లేదుగా..అదే సినిమా లో నటించిన రాంచరణ్ ని కలవకుండా జూ.ఎన్టీఆర్ ని కలవటం తోనే బీజేపీ ఉద్దేశం ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది.

జూ.ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం ఎలా ఉంటుందో 2009 ఎన్నికల ప్రచారంలో చూసి,తాత పోలికలతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ని అందుకే బీజేపీ వాడుకోవటానికి వేసిన ఎత్తుగడే ఈ బేటీ నా??భవిష్యత్హులో జూ. ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా బీజేపీ తరపున ప్రచారం చేసే అవకాశం ఉందా??.ఆలా ప్రచారం చేయటానికి జూ.ఎన్టీఆర్ బీజేపీ లో చేరాల్సిన అవసరం కూడా లేదు .,కాబట్టి మహారాష్ట్ర లో జరిగిన పరిణామాలే టీడీపీలో వచ్చే అవకాశం ఉందా?…టీడీపీ లో జూనియర్ ఎన్టీఆర్ తో అధికారం మార్పిడి చేసి, బీజేపీ లాభం పొందాలనుకుంటోంది…ఒక వేళ ఇదే జరిగితే ఇక చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా, పార్టీ అధ్యక్షుడి హోదా రెండూ ఒకే సారి దూరం అయినట్టే..

Share post:

Latest