నాలుగు స్తంభాలాట..జగన్ చూపు ఎవరిపై?

ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే…ఏపీలో రాజకీయం ప్రతిరోజూ ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తుంది..ఇటు అధికార వైసీపీ గాని, అటు ప్రతిపక్ష టీడీపీ గాని…ఎన్నికలే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నాయి…ఇదే క్రమంలో అప్పుడే అభ్యర్ధులని ఖరారు చేసుకునే విషయంలో దూకుడుగా ఉన్నాయి. అయితే సీట్ల విషయంలో రెండు పార్టీల్లోనూ నాయకుల మధ్య పోటీ ఎక్కువ ఉంది. ఇక రాజధాని అమరావతిలో ఉన్న తాడికొండ నియోజకవర్గం కోసం వైసీపీలో గట్టి పోటీ ఉంది.

రాజధాని అమరావతి ఉన్నా సరే గత ఎన్నికల్లో తాడికొండలో టీడీపీ గెలవలేదు…అనూహ్యంగా వైసీపీ నుంచి ఉండవల్లి శ్రీదేవి విజయం సాధించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడంతో అమరావతిలో వైసీపీపై వ్యతిరేకత పెరిగింది…అదే సమయంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది…ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఎన్నికల్లో తాడికొండ సీటు మళ్ళీ శ్రీదేవికి ఇస్తే అక్కడ గెలవడం కష్టమని తెలుస్తోంది.

దీంతో ఈ సీటు కోసం వైసీపీలో పోటీ పెరిగింది. అయితే మళ్ళీ సీటు దక్కించుకోవాలని శ్రీదేవి గట్టిగానే ట్రై చేస్తున్నారు..అటు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సైతం…ఈ సీటుపైనే కన్నేశారు…పైగా జగన్ కు సన్నిహితుడుగా ఉన్నారు. దీంతో ఈ సీటు ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్నారు. అటు సీనియర్ నేత, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ సైతం…తాడికొండపై ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఈయన కాంగ్రెస్ లో ఉండగా రెండుసార్లు తాడికొండ నుంచి గెలిచారు. పైగా ఆయన సొంత స్థానం కూడా ఇదే.

ఇక గుంటూరు జెడ్పీ చైర్ పర్సన్ హెన్రీ క్రిస్టినా కూడా ఈ సీటుపైనే కన్నేసినట్లు తెలుస్తోంది…మొత్తానికైతే తాడికొండలో నాలుగు స్తంభాలాట నడుస్తోంది. మరి తాడికొండ సీటు విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది…మళ్ళీ శ్రీదేవికి మాత్రం సీటు దక్కడం కష్టమని తెలుస్తోంది. అయితే టీడీపీని ఎదురుకోవాలంటే సీనియర్ నేత డొక్కాకు సీటు ఇస్తే బెటర్ అనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి తాడికొండ సీటు ఈ సారి ఎవరికి దక్కుతుందో.