ఆమె పై కోపం తో ఏకంగా రూ.4 కోట్లు నష్టపోయిన అర్జున్ కపూర్..!!

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మలైకా అరోరా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో బోల్డ్ ఫోటోషూట్లతో అందరినీ మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది . ఇకపోతే ఈమె గత కొద్దిరోజులుగా అర్జున్ కపూర్ తో ప్రేమలో పడిందనే విషయం అందరికీ తెలిసిందే.. అందుకు సంబంధించిన వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే అర్జున్ మలైకాతో బ్రేకప్ చెప్పి.. ఆమె పై కోపం తో తన ఇంటి పక్కనే ఉన్న ఇంటిని కూడా అమ్మేసినట్లు తాజా వార్తలు వెలబడుతున్నాయి. ఇక ఇందులో దాగి ఉన్న అసలు విషయం ఏమిటంటే తెలుసుకుందాం.Fan suggests Malaika Arora's spicy sauce to Arjun Kapoor, actor says she's  'busy travelling, taking Insta-worthy pics' | Entertainment News,The Indian  Express

సాధారణంగా బాలీవుడ్ తారలు ఎప్పటికప్పుడు ఖరీదైన ప్లాట్ లను కొనుగోలు చేయడం , తిరిగి వాటిని అమ్మడం లాంటివి చేస్తూ బిజీబిజీగా ఉంటారు. ముఖ్యంగా ముంబైలోని ఖరీదైన ప్రాంతాలలో హిందీ సినీ తారల ఇంటి ధరలు వింటే మాత్రం ఖచ్చితంగా సామాన్యులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. సినీ తారలతో పాటు క్రికెటర్లు కూడా ముంబైలోని ఖరీదైన ప్రాంతాలలో పదుల కోట్ల రూపాయల విలువ చేసే ఫ్లాట్లను క్రయవిక్రయాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ఇక ఈ క్రమంలోనే అర్జున్ కపూర్ కూడా తన ఫోర్ బెడ్ రూమ్ ఫ్లాట్ ను అమ్మేసినట్లు సమాచారం. సుమారుగా 16 కోట్ల రూపాయల వ్యయానికి తన ప్లాట్ ను అమ్మేశాడు అని.. అంతేకాదు నష్టానికి ఆయన తన ఫ్లాట్ ను అమ్మేసినట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇక అసలు విషయం ఏమిటంటే.. గతంలో అర్జున్ కపూర్ ఈ ఫ్లాట్ ను 20 కోట్ల రూపాయలు పెట్టీ కొనుగోలు చేశాడు అయితే ఇప్పుడు కేవలం 16 కోట్ల రూపాయలకే అమ్మి 4 కోట్ల రూపాయలను నష్టం తెచ్చుకున్నాడు. తన ప్రేయసి మలైకా అరోరా ఇంటి పక్కనే ఉన్న ఈ ఫ్లాట్ ను ఏరి కోరి మరి రూ.20 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాడు.

కానీ ఇప్పుడు వీరిద్దరి మధ్య వాదన మొదలైంది అనే కారణంతోనే ఆమె దగ్గర తన ఇంటిని కూడా ఉంచకూడదని ఏకంగా రూ.4 కోట్ల నష్టానికి అర్జున్ కపూర్ తన ఇంటిని అమ్మేశాడు.