వారెవ్వా..అభిమానులకు బిగ్ మెగా అప్​డేట్​..సిల్వర్​ స్క్రీన్​ షేక్ అవాల్సిందే..!!

రంజాన్ పండుగ వేళ ..అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్ చెప్పారు సంగీత దర్శకుడు తమన్. వరుస హిట్లతో దుమ్ము రేపుతున్న తమన్..ఫుల్ జోష్ మీద ఉన్నాడు. సినిమా ఫ్లాప్ అయినా..పాటలకు మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో తమన్ పేరు మారు మ్రోగిపోతుంది. ఈ క్రమంలోనే చిరంజీవి హీరో గా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాకి ఆయనే సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు. చిరంజీవి డ్యాన్స్ కు తమన్ డ్రమ్‌స్ కొడితే.. ధియేటర్స్ లో సౌడ్ అద్దిరిపోవాల్సిందే. అలా ఉంటాది వీళ్లిద్దరు జతకదితే.

కాగా మోహన్​ రాజా డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ గాడ్​ ఫాదర్​ మూవీలో బాలీవుడ్ హీరో..కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నారు అని ఇప్పటికే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే వీళ్లిద్దరి పై చిత్రీకరించాల్సిన అన్నీ సీన్స్ కూడా షూట్ కంప్లీట్ చేసుకున్నట్లు టాక్ బయటకు వచ్చేసింది. దీంతో తెర పై ఒక్కేసారి సల్మాన్ చిరులను చూస్తే జనాలకు పూనకాలు రావాల్సిందే అంటున్నారు అభిమానులు. ఇక ఇలాంటి టైంలో నే సినిమా నుంచి క్రేజీ అప్​డేట్​ వచ్చింది.

నేడు మంగళవారం రంజాన్​ పండుగ సందర్భంగా ఈ అప్​డేట్ ఇవ్వడం ఇంకా హ్యాపీ గా ఉంది. ఈ మూవీలో మెగాస్టార్​ చిరంజీవి, బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్​ ఖాన్​ కలిసి స్టెప్పులేయనున్నారని తెలిసిందే. అయితే, తాజాగా మ్యూజిక్​ డైరక్టర్​ తమన్​ సినిమా కి మరింత హైప్ ఇచ్చారు. ఈ సినిమా పై భారీ అంచనాలను పెంచుతూ..తాజా అప్​డేట్​ను ప్రకటించాడు తమన్. ఈ సినిమాలో చిరు-సల్మాన్​ కలిసి డ్యాన్స్ చేయనున్న సాంగ్​ను ఇండియన్​ మైఖేల్ డ్యాన్సర్​గా ప్రేరు సంపాదించుకున్న కోట్లాది డ్యాన్సర్ల హీరో ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించనున్నారు అంటూ అభిమానులకు కిక్ ఇచ్చే అప్ డేట్ ఇచ్చారు. మనం చూసిన్నట్లైతే.. చిరంజీవి ప్రభుదేవా కొరియోగ్రఫీ ల కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక చిరంజీవి-సల్మాన్ ఖాన్​ తో కలిసి చిందేయడం ఓ హైలెట్ అయితే.. దీనికి తమన్​ సంగీతం అందించడంతో మరో ప్లస్ కాగా..ఈఅ పాటకి ప్రభుదేవా కొరియోగ్రఫీ యాడ్​ కావడంతో ఈ సాంగ్​ ఏ రేంజ్​లో ఉంటుందో అని అభిమానులు ఊహించుకుంటున్నారు. ఈ పాట సిల్వర్​ స్క్రీన్​పై మరో వండర్ మేజిక్​ చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి రిజల్ట్ ఎలా ఉంటుందో..?