బాలకృష్ణ కొత్త టైటిల్ .. నువ్వు పులిబిడ్డ సామీ..!!

నందమూరి నట సింహం బాలకృష్ణ..రీసెంట్ గా అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా.. కెరీర్ లో ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఈ సినిమా లో బాలయ్య నటన అధ్బుతం అని మరోసారి చెప్పక తప్పదు. సినిమాలకు కమిట్ అయ్యాం..షూట్ కంప్లీట్ చేసేసాం..రిలీజ్ అయ్యింది..ఆ తరువాత నాకు అనవసరం అనుకునే టప్ కాదు బాలయ్య. ఆయన సినిమా కి కమిట్ అవుతున్నాడు అంటే..ఆ సినిమా ద్వార జనాలు అంతో ఇంతో మంచి నేర్చుకోవాలి..లేక అన్ని బాధలు మర్చిపోయి ప్రశాంతంగా నవ్వుకొవాలి అలా తన సినిమా కధలను చూస్ చేసుకుంటాడు బాలయ్య.

ప్రజెంట్ బాలయ్య క్రాక్ సినిమా డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా లో బాలయ్య కు జోడీ గా స్టార్ డాటర్ శృతి హాసన్ నటిస్తుంది. వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్ని వేశాలు భార్య భర్తలను ఆకట్టుకుంటాయి అంటూ ఇప్పటికే ఓ న్యూస్ బయటకి వచ్చింది. పైగా ఈ సినిమా కోసం శృతి తన బరువు కూడా పెంచుకుంటుందట. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని..ప్రజెంట్ స్టోరీలో బాలయ్య కు భార్య గా శృతి కనిపించినా..ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో బాలయ్య పక్కన మీరా జాస్మిన్ ని హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఇప్పుడు సినిమా టైటిల్ గురించిన వార్త వింటుంటే అందరికి “అన్నగారు” స్వర్గీయ నందమూరి తారక రామారావుగారు గుర్తు వస్తున్నారు. ఎందుకంటే.. బాలయ్య తో గోపీచంద్ తీస్తున్న సినిమాకి..”అన్నగారు” అనే టైటిల్ ని పెట్టాలి అనుకుంటున్నారట. ఇన్నాళ్లు వేటగాడు అని..బాలయ్యకు కలిసి వచ్చిన సింహ ని జత పరుస్తూ ‘వీరసింహారెడ్డి’ అని చాలా అనుకున్నారు. కానీ, ఫైనల్ గా “అన్నగారు” అనే పేరు అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. పైగా సినిమా కధకి కూడా ఈ టైటిల్ బాగా సూట్ అవుతుందని..ఆల్ మోస్ట్ ఇదే ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే..సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ “అన్నగారు” నే అవుతుంది. మనకు తెలిసిందే..ప్రతి తెలుగువారు తారకరామారావుగారిని “అన్నగారు” అంటూ అప్యాయంగా పిలుచుకుంటారు. ఇప్పుడే ఇదే పేరుని బాలకృష్ణ తన సినిమా కి పెట్టుకోవడం అభిమానులకు ఆనందాని ఇస్తుంది.