ఆమె అస్సలు హీరోయినే కాదంటూ..రష్మిక పై స్టార్ డైరెక్టర్ స్టన్నింగ్ కామెంట్స్..!!

“నా సామీ..రా రా సామీ”అంటూ నడుముతో య్యారంగా స్టెప్పులేసిన రష్మిక..గురించి ఎంత చెప్పిన తక్కువే. నాగ శౌర్య హీరో గా నటించిన ఛలో సినిమా తో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ఈ కన్నడ బ్యూటీ..మొదటి సినిమాతో నే అందరి చూపులు తన వైపు తిప్పుకునేలా చేసుకుంది. ఇక ఆ తరువాత తన టాలెంట్ తో తన అందం తో స్టార్ హీరోలైన మహేష్ బాబు, విజయ్ దేవరకొండా, బన్ని లాంటి స్టార్స్ పక్క హీరోయిన్ గా నటించి..మంచి మార్కులు కొట్టేసింది ఈ నేషనల్ క్రష్. ఇప్పుడు అందరు ఆమెను క్రష్మిక అంటూ ముద్దుగా పిలిచుకుంటున్నారు.

కాగా, శర్వా తో ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ ఫ్లాప్ సినిమా ను తన ఖాతాలో వేసుకున్న రష్మిక కి క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. అంతక ముందు వచ్చిన పుష్ప సినిమా అలాంటి ఇమేజ్ ని క్రియేట్ చేసి పెట్టింది రష్మికకి. ప్రజెంట్ రష్మిక బాలీవుడ్, టాలీవుడ్,కోలీవుడ్ లో వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీ బిజీ గా ఉంది. కాగా, రీసెంట్ గా స్టార్ డైరెక్టర్ హను రాఘవపూడి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. రష్మిక హను రాఘవపూడి డైరెక్షన్ లో ‘సీతారామం’ అనే చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తుండడం మరో విశేషం. కాగా, రీసెంట్ గా ఓ ఇంటర్వ్యుల్లో హను రాఘవపూడి ‘సీతారామం’ సినిమా గురించి మాట్లాడుతూ..కొన్ని ఆసక్తి కర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా..ఈ సినిమాలో రష్మిక పాత్ర గురించి నటన గురించి స్టన్నింగ్ కామెంట్స్ చేశారు. ” అస్సలు ఈ సినిమా లో రష్మిక హీరోయిన్ కాదు. హీరో…సినిమాకి హీరో అంటే రష్మికనే. ఈ పాత్ర కోసం మేము చాలా మంది హీరోయిన్స్ అనుకున్నాం. కాని ఫైనల్ గా రష్మిక అయితే బాగుంటుంది అని ఫిక్స్ అయ్యాం. మా నిర్ణయం తప్పుకాదు అని రష్మిక నటన చూశాక తెలిసింది. సినిమాలో లో సంధర్భానికి తగ్గట్లు ఆమె ఇచ్చే ఎక్స్ ప్రేషన్స్ సూపర్ గా ఉంటాయి. సినిమా మొత్తనికి రష్మిక పాత్రే హైలెట్” అంటూ చెప్పుకొచ్చారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో స్వప్న దత్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో రష్మిక అఫ్రీన్ అనే కాశ్మీర్ ముస్లీం అమ్మాయి పాత్ర లో కనిపిస్తుందని మేకర్స్ ఇప్పటికే లీక్ చేసారు.