బాలీవుడ్‌కు కొత్త మొగుడిగా తారక్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన ఎలా ఉంటుందో తెలుగు గడ్డపై పుట్టిన ప్రతిఒక్కరికీ తెలిసిందే. నందమూరి వంశం నుండి వచ్చిన ఈ టెర్రిఫిక్ యాక్టర్ తన పర్ఫార్మెన్స్‌తో ఎన్నో సినిమాలను ఒంటి చేత్తో విజయతీరాలకు చేర్చాడు. ఇక తారక్ నటన గురించి టాలీవుడ్‌లో ఏ ఒక్కరిని కదిలించినా ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తారు. అయితే ఇంతకాలం తారక్ నటన ఎలా ఉంటుందో రుచి చూడని బాలీవుడ్ జనాలకు ఇప్పుడు ఆయన కొత్త మొగుడిలా తయారయ్యాడు.

బాలీవుడ్‌లో కేవలం ఆడుతూ పాడుతూ నటించే యాక్టర్స్ మనకు కోకొల్లలుగా కనిపిస్తారు. అక్కడ స్టార్‌డమ్ ఉన్న యాక్టర్స్ కూడా ఇదే వైనాన్ని చూపిస్తుంటారు. కానీ ఇప్పుడు నార్త్ ఆడియెన్స్‌ను ఆర్ఆర్ఆర్ చిత్రం నోటివెంట మాట రాకుండా చేస్తోంది. కరోనా తరువాత వచ్చిన మోస్ట్ వెయిట్ పాన్ ఇండియా మూవీగా ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాకు నార్త్‌లో ఎక్కువగా ప్రీ-బుకింగ్ అడ్వాన్స్‌లు జరగకపోవడంతో చిత్ర యూనిట్ కాస్త ఆందోళన చెందింది.

కానీ ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కావడం.. ఈ సినిమాలో తారక్, చరణ్‌ల పర్ఫార్మెన్స్‌లకు నార్త్ ఆడియెన్స్ పాదాభివందనం చేస్తుండటంతో అక్కడ ఈ సినిమాకు అదిరిపోయే మౌత్ టాక్ దక్కింది. దీంతో ఈ సినిమాకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతూ వస్తోంది. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా తారక్ పర్ఫార్మెన్స్‌కు అక్కడి జనం కూడా బ్రహ్మరథం పడుతున్నారు. కొమురం భీముడో పాటలో తారక్ పలికించిన ఎక్స్‌ప్రెషన్స్‌కు అక్కడి జనం ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి నెలకొంది. మొత్తంగా నటనా పరంగా చూస్తూ బాలీవుడ్‌కు కొత్త మొగుడు దొరికాడని బీటౌన్ క్రిటిక్స్ అంటున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం అక్కడ ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయి మరింత జోరును ప్రదర్శిస్తోంది. చూస్తుంటే రాబోయే రోజుల్లో తారక్ బాలీవుడ్‌ను కూడా ఏలడం ఖాయంగా కనిపిస్తుందని అంటున్నారు అక్కడ ఆర్ఆర్ఆర్ సినిమాను చూసిన వారు.