బన్నీ దెబ్బకి సీన్ మొత్తం మారిపోయింది ..ఎందుకంటే ?

ఒక్క సినిమా హీరో గ్రాఫ్ ని మార్చేస్తుంది .పుష్ప సినిమా కూడా అల్లు అర్జున్ ని ఒక లెవెల్ కి తీసికివెళ్ళి కుర్చేపెట్టేంది .ప్రభాస్ తరువాత పాన్ ఇండియాలో ఆ క్రేజ్ రామ్ చరణ్ , ఎన్టీఆర్ లకు వస్తాయి అనుకుంటే అల్లు అర్జున్ ఎంటరైయ్యి మొత్తం సీనే మార్చేశాడు .ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా మూవీ వాయిదాల మీదా వాయిదాలు పడుతుంటే పుష్ప రాజ్ పాన్ ఇండియా ఎంట్రీ మొత్తం లెక్కలనే మార్చేసింది .

రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి రెండు పార్టులతో ప్రభాస్ దెబ్బకి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు .బాహుబలి ప్రభాస్ రేంజ్ ని ఉంచినంత రేంజ్ కి తీసుకెళ్లింది .మళ్లీ అదే రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ పాన్ ఇండియా లెవెలికి దూసుకుపోతారు అని అందరు అనుకున్నారు .450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మీద చాలాఆశలు పెట్టుకున్నారు ఎన్టీఆర్ ,చరణ్ .ప్రభాస్ ప్రక్కన తొడగొట్టి నిలబడాలనుకున్నారు .అయితే వరస వాయిదాలు వాళ్లఆశలపై నీళ్లు చల్లుతున్నాయి .

ఈ వాయిదాలు కంటే అల్లు అర్జున్ ఆర్ఆర్ఆర్ మీద పెద్ద దెబ్బ కొట్టాడు.ఏ ముహూర్తాన ‘దగ్గేదిలే ‘అన్నాడో లేదుకానీ బన్నీ క్రేజ్ ఎక్కడ తగ్గట్లేదు .కరోనా వేవ్లో విడుదలైన పుష్ప బాక్సాఫీస్ దగ్గర సునామి సృస్టించమే కాకుండా అల్లు అర్జున్ బ్రాండ్ ఇమేజీని అల్ టైం హైక్ చేర్చేసింది .బన్నీ బ్రాండ్ ఇప్పుడు ప్రభాస్ పక్కన నిలబడి మీసం మెలేస్తుంది .పుష్ప తరువాత బన్నీ మాస్ సినిమాలన్నీ దుమ్ము దులిపి డబ్ చేసి ఇప్పుడు వేరొక భాషలో రిలీజ్ చేస్తున్నారు .అందుకే శభాష్ బన్నీ అనేది .