ప్ర‌ముఖ ఓటీటీకి `శాకిని డాకిని`.. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ అప్డేట్‌!

టాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు రెజీనా కాసాండ్రా, నివేథా థామస్ క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `శాకిని డాకిని`. సుధీర్‌ వర్మ ద‌ర్శ‌క‌త్వంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్‌, క్రాస్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ల‌పై డి.సురేష్‌బాబు, సునీత తాటి, హ్యున్‌ వ్యూ థామస్‌ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

దక్షిణ కొరియాలో సంచలన విజయం సాధించిన `మిడ్ నైట్ రన్నర్స్` చిత్రానికి `శాకిని డాకిని` పేరుతో రీమేక్ చేస్తున్నారు.టైటిల్ పాత్రలను రెజీనా కంసాండ్ర, నివేదా థామస్ పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగింది. అయితే వినిపిస్తున్న తాజా సమాచారం ప్ర‌కారం.. ఈ సినిమా థియేట‌ర్స్‌లో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో విడుద‌ల కానుంద‌ట‌.

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సాలిడ్ రేటుకు సొంతం చేసుకుంద‌ని తెలుస్తోంది. అంతే కాదు, అతి త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించ‌నుంద‌ని టాక్‌. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే.. ఆ అప్డేట్ వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

కాగా, కిడ్నాప్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మూవీకి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ కెమెరా వ‌ర్క్ చేస్తుండ‌గా..మిక్కీ ఎంసీ క్లియ‌రీ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక చాలా కాలం నుంచి సరైన హిట్ లేక సతమతమ‌వుతున్న రెజీనా ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి రావాల‌ని చూస్తోంది. మ‌రోవైను నివేథా సైతం ఈ సినిమాతో మంచి విజ‌యం అందుకోవాలని ఆర‌ట‌ప‌డుతోంది.