గ‌ప్‌చుప్‌గా ఆ స్టార్ హీరోను పెళ్లాడిన‌ సాయి ప‌ల్ల‌వి..ఫొటోలు వైర‌ల్‌!

ప్ర‌ముఖ హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి గ‌ప్‌చుప్‌గా ఓ స్టార్ హీరోను పెళ్లి చేసుకుంది. సన్నిహితులు, వేద పండితుల సమక్షంలో వైభ‌వంగా సాయి ప‌ల్ల‌వి వివాహం జ‌రిగింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొట్టేస్తున్నాయి. అయితే సాయి ప‌ల్ల‌వి రియ‌ల్‌గా పెళ్లి చేసుకోలేదులేండి. రీల్‌ పెళ్లి మాత్రమే.

ఇంత‌కీ రీల్‌గా సాయి ప‌ల్ల‌వి పెళ్లి చేసుకున్న స్టార్ హీరో ఎవ‌రో కాదు.. మ‌న నానినే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..రాహుల్‌ సాంకృత్యన్ దర్శకత్వంలో న్యాచుర‌ల్ స్టార్ నాని, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `శ్యామ్ సింగ్ రాయ్‌`. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు కూడా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 24న తెలుగుతో పాటు త‌మిళ్‌ క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న చిత్ర యూనిట్‌.. తాజాగా సోష‌ల్ మీడియా ద్వారా కొన్ని ఫొటోల‌ను షేర్ చేసింది.

ఇందులో కోల్‌కతా సాంప్రదాయంలో సాయి ప‌ల్ల‌విని నాని పెళ్లాడుతూ క‌నిపించాడు. అలాగే పెళ్లి దుస్తుల్లో సాయి ప‌ల్ల‌వి ముసి ముసి న‌వ్వులు న‌వ్వుకుంటూ ఎంతో అందంగా క‌నిపిస్తోంది. మొత్తానికి వీరి రీల్ పెళ్లి ఫొటోలు మాత్రం అభిమానుల‌ను, నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటూ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

https://www.instagram.com/p/CXu6_AYvDnY/?utm_source=ig_web_copy_link