పండగ రేసు నుండి పక్కకు తప్పుకున్న భీమ్లా నాయక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తుండగా, మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నేటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను బద్దలు కొడుతుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

అయితే సంక్రాంతి బరిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు గతకొంత కాలంగా భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా చిత్రాలు పోటీ పడుతుండగా, ఈ క్రమంలోనే రిలీజ్‌కు రెడీగా మహేష్ బాబు సర్కారు వారి పాట కూడా ముందుకు వచ్చింది. అయితే నిర్మాత మండలిలో ఈ సినిమాల రిలీజ్ విషయంపట్ల అందరూ ఏకాభిప్రాయానికి రావడంతో సంక్రాంతి బరిలో సర్కారు వారి పాట చిత్రం తన రిలీజ్‌ను వాయిదా వేసుకుంది. అయితే భీమ్లా నాయక్ మాత్రం సంక్రాంతి బరిలోనే రిలీజ్ చేస్తున్నట్లు తరుచూ గట్టిగా చెబుతూ వచ్చాడు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంక్రాంతి బరిలో తమ హీరో సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో తాజాగా వారందరికీ పవన్ కళ్యాణ్ భారీ షాక్‌ను ఇచ్చాడు.

సంక్రాంతి బరిలో భీమ్లా నాయక్ చిత్రాన్ని రిలీజ్ చేయడం లేదని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ సినిమాను ఫిబ్రవరి నెలలో 25వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సినిమాను ఇలా హఠాత్తుగా వాయిదా వేయడంతో వారందరూ ఢీలా పడిపోయారు. అయితే మిగతా సినిమాల కలెక్షన్లకు గండి పడకూడదనే మంచి ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చిత్ర మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఫిబ్రవరి నెలలో భీమ్లా నాయక్ సోలో రిలీజ్‌తో వస్తాడా లేక అప్పుడు కూడా ఎవరైనా పోటీకి దిగుతారా అనేది చూడాలి.

ఇక ఈ సినిమాలో పవన్ సరసన అందాల భామ నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, యంగ్ హీరో రానా దగ్గుబాటి అదిరిపోయే పాత్రలో నటిస్తున్నాడు. ఆయన సరసన సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాలో వారి పర్ఫార్మెన్స్‌లు ఎలా ఉంటాయా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.